
భూమిపైన పెద్ద పెద్ద జలరాశుల సముదాయం సముద్రం. ఈ సముద్రం చాలా ప్రమాదకరమైనది. లోతైనదన్న సంగతి తెలిసిందే. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన వ్యక్తి ప్రపంచంలో లేడు అన్న సామెత గురించి తెల్సిందే.. సముద్రగర్భంలో అనేక జీవిరాశులు, అపార సంపదలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక గజ ఈతగాడు మాత్రమే సముద్రాన్ని ఈదగలడని అంటారు. సముద్రంలో ఈదాలనే కోరిక తీర్చుకోవడానికి, చాలా మంది తమ జీవితాలను లెక్కచేయరు.

అయితే మీకు ఈత కొట్టడం తెలియకపోయినా.. సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించాలని మీరు కోరుకుంటే.. ఈతరానివారు కూడా ఈదుకుంటూ సముద్రాన్ని ఈదుతూ.. ఆస్వాదించగలిగే సముద్రం గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఈ సముద్రంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు కోరుకున్నప్పటికీ ఈ సముద్రంలో మునిగిపోలేరు..

జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న డెడ్ సీ.. ఇది ప్రపంచంలోని అన్ని సముద్రాల కంటే ఎక్కువ ఉప్పగా ఉండే సముద్రం. ఈ సముద్రంలోని నీరు అత్యంత ఉప్పుగా ఉండడంతో ఇతర సాలమండర్ల కంటే 6 నుండి 7 రెట్లు ఎక్కువ ఉప్పు లభిస్తుంది.

నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఎవరూ మునిగిపోరు. దీంట్లో నీటి ప్రవాహం దిగువ నుండి పైకి ఉంటుంది. కనుక మీరు నేరుగా పడుకుని ఈ సముద్రంలో మునిగిపోలేరు. దీనితో ఈ సముద్ర తీరం ఎల్లప్పుడూ పర్యాటకుల సందడి నెలకొని ఉంటుంది.

ఈ సముద్రపు నీరు చాలా ఉప్పగా ఉంటుంది. ఇక్కడ మొక్క కాదు కదా.. చిన్న గడ్డి కూడా మొలవదు. అంతేకాదు ఈ సముద్రంలో చేపలు, ఇతర జీవులు కనిపించవు.

అయితే దీనిని అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. హిబ్రూలో దీనిని ఉప్పు సముద్రం అని పిలుస్తారు. చెప్పాలంటే.. ఈ సముద్రానికి కాలక్రమంలో అనేక పేర్లు మారాయి. అయితే ఎక్కువగా మృత సముద్రంగా గుర్తింపు సొంతం చేసుకుంది.