
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయా. దాంతో రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలపై ఉండే గార, పాచి సైతం మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారికి చింత గింజలు అద్భుతమైన వరం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం చింతల గింజల పొడిని నీళ్లలో కలిపి మరిగించి డికాషన్‌ను తయారు చేసుకోవాలి. ఈ డికాషన్‌ను రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాదు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే చింతగింజలను పొడి ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే అజీర్ణం తగ్గుతుంది.

చింత గింజల పొడి డికాషన్‌ను తాగడం వల్ల హైబీపీ సైతం తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. చింత గింజల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాయాలి. ఇలా చేస్తుంటే అవి త్వరగా మానుతాయి.

చర్మంపై మంగు మచ్చలు ఇతర సమస్యలతో బాధపడేవారు చింత గింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు. చింత గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మం పై ఉన్న మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తూ ఉంటే.. మీ చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది.

చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. నాలుగు వారాల్లో మోకాళ్ల నొప్పులు పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మోకాలి నొప్పులతో బాధపడే వారు ఈ పొడిని క్రమం తప్పకుండా వాడితే ప్రయోజనం ఉంటుందని సూచించారు.