
ఆఫ్ఘనిస్తాన్లోని బామియన్ బుద్దుల విగ్రాహాలను.. 2001లో తాలిబన్లు పేల్చివేశారు. దీంతో అక్కడికి పర్యాటకులకు.. స్థానికులకు అనుమతి లేదు.

సిరియాలోని పురాతన నగరం పామిరా.. ప్రస్తుతం సిరియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడికి వెళ్లడం నిషేదించారు. ఈ ప్రాంతంలోని విగ్రాహాలు.. ఎల్హాబెల్ టవర్ ను 2015లో ఐసీఎల్ ద్వంసం చేసింది.

నైజర్‌లోని అతిపెద్ద నగరం.. అగాడెజ్.. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. ఇక్కడ 15-16వ శతాబ్దాల చారిత్రాత్మక కళాఖండాలు, ఎత్తైన మట్టి ఇటుక నిర్మాణాలు కూడా ఉన్నాయి. 2007 నుంచి ఇక్కడికి వెళ్లడాన్ని నిషేదించారు.

టర్కీలోని సిమెనా గ్రామానికి అసలు వెళ్లాడానికి వీల్లేదు. ఇక్కడికి వెళ్లేందుకు రహదారులు కూడా లేవు. 2వ శతాబ్ధంలో వచ్చిన భూకంపాల వలన ఈ గ్రామం పూర్తిగా నాశనమైంది. ఇక్కడ లైసియన్ నాగరికత అవశేషాలు ఉన్నాయి.

సుడాన్ లోని పరోమిడ్స్ ఆఫ్ మెరోను కూడా ప్రపంచ వారసత్వాలలో ఒకటి. ప్రస్తుతం అక్కడ రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడికి పర్యాటకులకు అనుమతి నిషేదించింది.

ఆఫ్రికాలోనే టింబక్టు, మాలి ప్రాంతాలు ఇస్లామిక్ మేధావుల కేంద్రంగా ప్రసిద్ధి. ఇక్కడ ఉండే మసీదులను మిలిటెంట్ గ్రూపులు నాశనం చేశారు. వీటని యుద్ద నేరాలుగా ముద్రించారు.