
అండీస్ పర్వతాలపై ఉన్న మచుపిచ్చు 15వ శతాబ్ధపు మహా నగరం. ఇప్పటికీ ఈ ప్రాంత రహస్యాలు శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. ఇది ప్రపంచంలోని అత్యంత కళాత్మక నమునాలకు నిలయం. ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి 20వ శతాబ్దంలో తెలిసింది.

ఇది సామ్రాజ్యం కోల్పోయిందని నమ్ముతుంటారు. హిరామ్ బింగ్హామ్ III దీనిని 1911లో కనుగొన్నారు. అతను అతను ఇప్పటికీ విల్కాబాంబ నగరం కోసం అన్వేషిస్తున్నాడు. అయితే మొదట్లో మచు పిచ్చు నగరాన్ని విల్కాబాంబ అనుకున్నారు. 1964లో జీన్ సావోయ్ అసలు నగరమైన ఎస్పిరిటు పంపాను కనుగొన్న సమయంలో ఈ ప్రాంతం మచు పిచ్చు అని తెలిసింది.

అయితే స్పెయిన్ దేశస్తులు మచు పిచ్చు నగరాన్ని దోచుకోకుండా ఉండేందుకు..దాని చుట్టు పక్కల అడవిని కాల్చివేసారు. దీంతో స్పానిష్ ప్రజలు ఈ ప్రాంతాన్ని కనిపెట్టలేకపోయారు. అందుకే దీని గురించి ప్రపంచానికి తెలియదు. అయితే 1911లో హిరామ్ బింగ్హామ్ దీనిని కనుగొన్నారు.

ఇప్పటికీ వెలువడని రహస్యాలలో ఇది ఒకటి. ఇక్కడ ఎప్పుడూ వచ్చే భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు జరిగాయి. ఈ ప్రాంతాన్ని పురాతన ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించారు.

ఈ నగరంలో 60 శాతం భూమి కింద ఉన్నట్లు అంచనా. భవన పునాదులలో.. తడిని ఎదుర్కోవడానికి రాక్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు.

అండీస్ పర్వతాలలో ఉన్న ఈ స్థలాన్ని చూడటానికి ఒకటి కంటే ఎక్కువ కొండలను ఎక్కాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాంతం నుంచి కింద ఉన్న ఉరుబాంబ నదిని పూర్తిగా వీక్షించవచ్చు.

అయితే కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు మచు పిచ్చు ప్రాంతాన్ని పూర్వపు ఒక రాజ కుటుంబ రిసార్ట్ అని అంటుంటారు. కుజ్కో వారి బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం కోసం ఇక్కడికి వచ్చేవారని నమ్ముతారు.