Rajeev Rayala | Edited By: Anil kumar poka
Jul 01, 2021 | 6:24 PM
నిప్పుల కొలిమిలా మారిన కెనడా-యుఎస్. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలంతా భయాందోలనుకు గురవుతున్నారు.
కెనడా-యుఎస్ లో రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్న ఎండలు. వేడికి తట్టుకోలేక ప్రజలంతా వాటర్ పార్కులకు క్యూకడుతున్నారు
యుఎస్ లో ఎండల కారణంగా 60 మందికి పైగా మరణించారని తెలుస్తుంది. ముల్ట్నోమాలో ఏకంగా 45 మంది మరణించారు.
కెనడాలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ఇప్పటికే ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేయగా, ఇప్పటివరకూ 240 మంది ఎండ వేడిమిని, వడగాడ్పులను తట్టుకోలేక కన్నుమూశారు.
పెరుగుతున్న వేడి కారణంగా ప్రజలు నిస్సహాయంగా మారారు మరియు ఇప్పుడు వారు వాటర్ పార్కులు మరియు సరస్సుల వైపు వెళ్ళడం ప్రారంభించారు. ప్రజలు సరస్సులు, నదులు మరియు సముద్రాలలో స్నానం చేయడానికి ప్రజలు మక్కువ చూపుతున్నారు.
చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు.