Pakistan Tour: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? పక్కనే ఉన్న పాకిస్థాన్ వెళ్లండి.. ప్రకృతి అందాలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

|

May 16, 2023 | 5:17 AM

సమ్మర్ వచ్చేసిందని విదేశి టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే తప్పక పాకిస్థాన్‌ని సందర్శించండి. పాకిస్థాన్‌లో కూడా సందర్శించడానికి యోగ్యమైన అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఈ దేశంలోని పర్యాటక ప్రదేశాలు కూడా ప్రపంచంలోని చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.

1 / 5
పాకిస్థాన్‌లో కూడా చూడదగ్గ అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ దేశంలోని పర్యాటక ప్రదేశాలు కూడా ప్రపంచంలోని చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. మరి మన దాయాది దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం రండి..

2 / 5
హుంజా వ్యాలీ: గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఉన్న ది హుంజా వ్యాలీ పాకిస్థాన్‌లోనే అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ లోయ పర్వత శిఖరాల మధ్య ఉంది. అ వ్యాలీలోని పచ్చని పొలాల దృశ్యాలు మీ మనసును దోచేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

3 / 5
అట్టాబాద్ సరస్సు: ఒంటరి ప్రయాణం చేయాలనుకునేవారికి అత్యుత్తమ గమ్యస్థానం ఈ అట్టాబాద్ సరస్పు. ఈ సరస్సు పాకిస్థాన్‌లోని అత్యంత అందమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. మీరు ఇక్కడ బోటింగ్, స్కీయింగ్, ఫిషింగ్ వంటివి చేసి ఆనందించవచ్చు.

4 / 5
బాద్షాహి మసీదు: బాద్షాహి మసీద్ మొఘల్ సామ్రాజ్యానికి ఓ స్మారక చిహ్నం. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ స్మారక చిహ్నం మొఘల్ వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. మీరు దాని అందాన్ని చూసి నిజంగా ఇష్టపడతారు.

5 / 5
మొహెంజొదారో: మీకు చరిత్రపై కొంచెమైనా ఆసక్తి ఉంటే మీరు మొహెంజొదారోను తప్పక సందర్శించవచ్చు. ఇది పాకిస్థాన్‌లోనే కాదు, అఖండ భారతదేశంలోనే అత్యంత ప్రాచీన ప్రదేశం. ఇంకా పాక్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటైన సింధు లోయ నాగరికతకు ఇది ప్రధాన నగరం.