3 / 9
అంగ్ కోర్ వాట్ ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. అంగ్ కోర్ వాట్ అంటేనే.. దేవాలయాల నగరం అని అర్థం. క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా అంగ్ కోర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావడం గమనార్హం.