మోనాలిసా పెయింటింగ్ పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా.. ఆ చిరునవ్వును చూసి ప్రాణం పోశాడు..

|

Nov 19, 2021 | 8:26 PM

మోనాలిసా పెయింటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన.. ఖరీదైన పెయింటింగ్. ఈ మోనాలిసా పెయింటింగ్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా.

1 / 5
దాదాపు 5 దశాబ్ధాల క్రితం.. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ  మోనాలిసా పెయింటింగ్ వేశాడు. మోనాలిసా అంటే మై లేడీ అంటుంటారు. డావిన్సీ రచయిత కూడా. కానీ అతను ఇప్పటికీ మోనాలిసా గురించి ఏం రాయలేదు. ఈమెను ఫ్లోరెన్స్ లోని ఇటాలియన్ మహిళ లిస్ గెరార్డిని అని అంటారు పరిశోధకులు. డావిన్సీ తనను తాను మహిళగా మార్చుకుని ఈ పెయింటింగ్ వేశారని మరికొందరి వాదన.

2 / 5
లియోనార్డో డావిన్సీ ఈ పెయింటింగ్ ను 1503లో తయారు చేయడం ప్రారంభించి 1517లో పూర్తి చేశారు. అంటే దాదాపు 14 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. మోనాలిసా పెదవుల తయారీకే 12 ఏళ్లు పట్టిందట. లియోనార్డో డావిన్సీ ఈ చిత్రాన్ని పూర్తిచేయలేదు.. అతని మరణం తర్వాత.. 1519లో అతని సహచరులు పుర్తిచేశారు. ఇది ప్రసిద్ధ చెక్కపై ఆయిల్ పెయింట్ తో తయారు చేశారు. ఈ పెయింటింగ్ చిత్రాలు చాలా పెద్దవిగా అనిపించదు. కానీ పెయింటింగ్ పరిమమాణం 30 నుంచి 21 అంగుళాలు.. 8 కిలోల బరువు మాత్రమే.

3 / 5
ఈ పెయింటింగ్ 21 ఆగస్ట్ 1911న పారిస్ లోని రిస్ లూబ్ మ్యూజియం నుంచి దొంగిలించబడింది.  మ్యూజియం ఉద్యోగి విన్సెంజో పెరుజియా దానిని దొంగిలించి ఇటలీకి తీసుకెళ్లాలనుకున్నాడు. వారు దీనిని ఇటలీ వారసత్వంగా భావించారు. ఇటలీకి చెందిన ఈ పెయింటింగ్ మ్యూజియంలోకి తిరిగి వచ్చింది. కానీ విన్సెంజోకు దొంగతనం కేసులో 6 నెలల జైలు శిక్ష విధించబడింది.

4 / 5
లియోనార్డో డా విన్సీ విద్యార్థిగా ఉన్న ఫ్రాన్సిస్కో మెల్జీ అలాంటి మరొక పెయింటింగ్‌ను గీశాడని చెబుతారు. దీనిని మోనాలిసా యొక్క జంట పెయింటింగ్ అని పిలుస్తారు. దీనిని స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ మ్యూజియో డి ప్రాడోలో ఉంచారు. 1514 -1516 మధ్య మరొక విద్యార్థి మోనాలిసా యొక్క న్యూడ్ వెర్షన్‌ను కూడా తయారు చేశాడు. దీనిని మోనా వన్నా అని పిలుస్తారు.

5 / 5
మీడియా నివేదికల ప్రకారం జూన్ 23, 1852న ఒక ఫ్రెంచ్ కళాకారుడు లూక్ మాస్పెరో మోనాలిసా చిరునవ్వు, అందం మీద వ్యామోహంతో పారిస్ హోటల్ పైకప్పుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పెయింటింగ్‌ను చాలాసార్లు పాడు చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పెయింటింగ్ దాని అసలు స్థలం నుండి 6 సార్లు మార్చారు. కొన్నిసార్లు దానిపై రాళ్లు, యాసిడ్‌ వేశారు. ఇలాంటి ఘటనల దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ ఫ్రేమ్‌లో ఉంచారు.