
సాదారణంగా అక్వేరియంలో ఉండే చేపలు ఎప్పుడూ మెలకువతో కనిపిస్తుంటాయి. అవి ఎప్పుడు నిద్రపోతాయి.. ఎలా పోతాయి అని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా గోల్డేన్ ఫిష్.. ఎప్పుడు ఎంతో హుషారుగా ఈత కొడుతుంటుంది.

చేపలు నిద్రపోతాయి. కానీ మనుషుల మాదిరిగా కాదు.. ఒక్కరాత్రి నిద్రపోతే ఉదయం 8 గంటల వరకు నిద్రపోతాయి.

చేపలు రోజంతా ఏ సమయంలోనైనా నిద్రపోవడం వలన వాటి అలసటను తగ్గించుకుంటాయి. చేపలు రోజంతా చాలా తక్కువ వ్యవధిలో నిద్రపోతాయి. ఇవి నిద్రపోతున్నప్పుడు వీటి మెదడు చాలా చురుకుగా ఉంటుంది.

చేపలు నీటి కింద మాత్రమే నిద్రపోతాయి. కొన్ని ఈత కొట్టకుండా ఓకే చోట ఉంటాయి. అప్పుడు అవి నిద్రపోతుంటాయి. చెరువులు, నదులలో ఒడ్డున నిద్రపోతాయి.

అక్వేరియంలో ఉండే చేపలు ఓకే చోట నిశ్చితంగా ఉంటాయి. అప్పుడు అవి నిద్రపోతుంటాయి. అలాగే కొన్ని రకాల చేపలు రాత్రిళ్లు మాత్రమే నిద్రపోతాయి.

చేపలకు కను రెప్పలు ఉండవు. అందుకే అవి ఎప్పుడూ కళ్లు తెరచి ఉంటాయి. కానీ ప్రతి చేప నిద్రపోయే విదానం వేరుగా ఉంటుంది. రాయి కింద.. ఆకుల కింద నిద్రపోతాయి. అయితే చేపలు వాటి గుడ్లను రక్షించుకునే సమయంలో చాలా రోజులు నిద్రపోవు. అందుకే ఇవి నిద్రకు భిన్నంగా ఉంటాయి.