మల్బరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని అందిస్తాయి. మల్బరీ పండ్లు తింటే వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి.

ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారికి మల్బరీతో బోలేడు ప్రయోజనాలు. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. క్రమం తప్పకుండా మల్బరీ పండ్లు తినడంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

మల్బరీతో చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా మల్బరీస్ తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలోని ఆంథోసైనిన్లు, రెస్వారెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా మార్చుతాయి. మల్బరీ పండ్లలో ఉన్న పోషకాలు, ప్లేవనాయిడ్స్ కంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

మల్బరీస్ తింటే వ్యాధినిరోధకశక్తి బలంగా మారుతుంది. ఇందులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది. మల్బరీస్ తింటే తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. మల్బరీ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. మల్బరీ పండ్లు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.