
ప్రెగ్నెన్సీ టైమ్‌లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొంత మందికి అవగాహన లేకపోవడం వల్ల మరింత టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పొట్టపై దురద. అవును.. ఈ సమస్య చాలా మంది తల్లుల్లో కనిపిస్తుంది. నెలలు గడిచే కొద్దీ పొట్ట పెరిగిపోతుండడంతో కడుపుపై ఉన్న చర్మం క్రమంగా సాగుంది. దీంతో బంప్ చుట్టూ దురద పెడుతుంటుంది.

విటమిన్ సి ఉన్న పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర అధికంగా తీసుకోవాలి. పాలకూరతో పాటు ఇతర ఆకు కూరలు కూడా తీసుకోవచ్చు.

అలాగే కడుపుపై దురదగా ఉంటే గోర్లతో గోకడం వంటివి చేయకూడదు. బదులుగా అవకాడో ఆయిల్ వాడవచ్చు. ఇదులోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ కూడా వాడవచ్చు. వీటిల్లో ఏదైనా ఒకటి కడుపు చుట్టూతా రాస్తే దురద తగ్గి ఉపశమనం లభిస్తుంది.

దురదగా ఉంటే ఓ గుడ్డని వేడినీటిలో ముంచి దానిని పొట్టపై వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కడుపు భాగమంతా రాసుకోవాలి. దీని వల్ల దురద ఎక్కువగా ఉండదు. సమస్య కూడా తగ్గి కడుపుపై చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

అయితే పాలకూర చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త కణాల తయారీలో సహాయపడుతుంది. సాధారణంగా గర్భిణీలు చలి కాలంలో చేపలను ఎక్కువగా తినాలి. చేపలు తినడం ద్వారా పిల్లల మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది.