
చలికాలం వచ్చిందంటే అందాన్ని కాపాడుకోవడం పెద్ద పని. ఈ సీజన్‌లో సహజంగానే చర్మ సౌందర్యం క్షీణిస్తుంది. చల్లటి గాలి, పెరుగుతున్న కాలుష్యం వల్ల రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్ లో చాలా మందిలో డ్రై స్కిన్ సమస్య కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ముఖానికి మేకప్ వేసుకుంటే, సహజంగా అనిపించదు. కాబట్టి మేకప్ వేసుకునే ముందు మీరు ఫౌండేషన్‌ను ఎలా అప్లై చేస్తారనే దానిపై మీ మేకప్ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అమ్మాయిలు అందం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారన్న సంగతి తెలిసిందే. ఇక పండుగలు, శుభకార్యాల్లో అమ్మాయిలు మేకప్ లేకుండా బయటకు అస్సలురారు. అందంగా కనిపించాలని రకరకాల మేకప్‌లను ప్రయత్నిస్తుంటారు. అయితే సహజంగా, అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మం పొడిగా ఉంటే, ఫౌండేషన్ అప్లై చేసే ముందు ముఖంపై మాయిశ్చరైజర్ అప్లై చేయడం గుర్తుంచుకోవాలి. ఇది చర్మం పొడిబారడాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత చర్మానికి ఫౌండేషన్ రాసుకుంటే ముఖం మృదువుగా కనిపిస్తుంది.

చలికాలంలో చల్లని వాతావరణం కారణంగా చర్మం త్వరగా పొడిగా మారుతుంది. కాబట్టి చర్మానికి అప్లై చేసే ఫౌండేషన్ ఎంపిక సరైనదిగా ఉండటం ముఖ్యం. వీలైనంత వరకు పౌడర్ బేస్డ్ ఫౌండేషన్ వాడటం మానేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మంలోని జిడ్డు పీల్చుకుని చర్మం పొడిబారుతుంది. కాబట్టి ఈ సీజన్ క్రీమ్ లేదా ఆయిల్ ఫౌండేషన్‌ను ఎంచుకోవడం బెటర్. ఇది మీ చర్మం పొడిగా కనిపించకుండా చేస్తుంది.

మాయిశ్చరైజర్, ప్రైమర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే మీ చర్మం స్వభావం ఆధారంగా క్రీమ్ ఉపయోగించాలి. మీ చర్మం కాస్త బిగుతుగా ఉంటే BB క్రీమ్‌ని ప్రయత్నించాలి. చేతి లేదా మేకప్ బ్రష్ సహాయంతో చర్మంపై అప్లై చేయవచ్చు. కొంతమందికి ముఖంపై మొటిమల మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు, నల్లటి వలయాలను దాచడానికి కన్సీలర్ సహాయపడుతుంది. కన్సీలర్‌ను అప్లై చేసి, బ్రష్ లేదా స్పాంజ్‌తో వృత్తాకారలో ముఖంపై అప్లై చేయాలి.