Kitchen Hacks: వంట పాత్రల జిడ్డు వదిలించడానికి వేడి నీటిని ఉపయోగిస్తున్నారా? కాస్త ఆలోచించడం బెటర్‌..

Updated on: Jan 31, 2025 | 1:34 PM

వంటకు పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా నూనెతో కూడిన జిడ్డు పాత్రలను శుభ్రం చేయడం, వంట పాత్రలపై అంటుకున్న నూనెను వదిలించడానికి చాలామంది వేడి నీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వంటకు వినియోగించే పాత్రలను శుభ్రం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే లేనిపోని చిక్కులకు ఇవే కారణం అవుతాయి. ముఖ్యంగా నూనెతో కూడిన జిడ్డు పాత్రలను శుభ్రం చేయడం గృహిణులకు అతిపెద్ద సవాల్‌. ఇవి ఓ పట్టాన శుభ్రం కావు. దీంతో వంట పాత్రలపై అంటుకున్న నూనెను వదిలించడానికి చాలామంది వేడి నీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాత్రలపై జిడ్డును వేడి నీటితో తేలికగా శుభ్రం చేయవచ్చు. కానీ ఆ తర్వాత సంభవించే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అసలెందుకు వేడి నీటితో పాత్రలను శుభ్రం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
జిడ్డైన పాత్రలను శుభ్రం చేయడానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల.. అందులో ఉపయోగించే ఆహారంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే వేడి నీటితో జిడ్డు పాత్రలను కడిగినప్పుడు.. వాటిపై మురికి నీరు బలంగా అంటుకుపోతుంది. పాత్రలపై వేడి నీరు చల్లారిన తర్వాత, ఈ విధమైన మరకలు పాత్రలపై కనిపిస్తాయి.

3 / 5
మీరు వేడి నీటిలో నాన్ స్టిక్ లేదా ఐరన్ పాత్రలను శుభ్రం చేస్తే.. దానిలోని ఉపరితల పూత మరింత ప్రభావితం అవుతుంది. వేడి నీరు పాత్రల్లో పగుళ్లకు కారణమవుతుంది. ముఖ్యంగా నాన్-స్టిక్ ప్యాన్‌లను వేడి నీటితో కడిగితే అవి త్వరగా పాడైపోతాయి.

4 / 5
బదులుగా సబ్బుతో సున్నితంగా వీటిని శుభ్రం చేయాలి. ప్యాన్‌లను శుభ్రం చేసేటప్పుడు, తేలికపాటి డిష్‌వాషింగ్ సబ్బు లేదా ద్రవాన్ని ఉపయోగించాలి. ఇది పాత్రలకు హాని కలిగించకుండా మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.

5 / 5
స్టీల్, ఉన్ని వంటివి కాకుండా మృదువైన సిలికాన్ స్క్రబ్బర్‌లను పాత్రలను శుభ్రం చేయడానికి ఎంచుకోవాలి. కఠినమైన స్క్రబ్బర్‌లు పాత్రలఉపరితలంపై గీతలు పడేలా చేస్తాయి. కంటైనర్ పైన ఉన్న రక్షిత పొరలను దెబ్బతీస్తాయి.