Watermelon: మీరూ ఫ్రిజ్‌లో పుచ్చకాయలు నిల్వ చేస్తున్నారా? వీటిని తినడం ఎంత డేంజరో తెలుసా..

Updated on: Mar 09, 2025 | 8:54 PM

వేసవి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. సులభంగా జీర్ణమయ్యే ఈ పండు శరీరానికి తగినంత తేమను అందించి, వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే చాలా మంది వేసవిలో దీన్ని ఎక్కువగా తింటారు. కొంతమంది పుచ్చకాయను పూర్తిగా తినకుండా.. కొంత భాగాన్ని ఫ్రిజ్‌లో దాచుకుంటారు. ఇలా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు..

1 / 5
వేసవిలో ప్రకృతి ప్రసాధించిన అద్భుత వరం పుచ్చకాయ. పండ్ల రారాజు మామిడి, లిచీ, పుచ్చకాయ వంటి అన్ని రకాల పండ్లు ఈ కాలంలో అధికంగా వస్తాయి. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో పుచ్చకాయకు మించిన ప్రత్యామ్నయం మరొకటి లేదు.

2 / 5
ఇందులో సిట్రుల్లైన్ అనే ఒక రకమైన అనావశ్యక అమైనో ఆమ్లం ఉంటుంది. పుచ్చకాయలోని తెల్లని భాగం తినడం వల్ల శరీరంలో దీని స్థాయి పెరుగుతుంది. సిట్రులిన్ మన రక్త నాళాలను విస్తరిస్తుంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం సిట్రుల్లైన్ కండరాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఫలితంగా పనితీరు పెరుగుతుంది.

3 / 5
పుచ్చకాయలో సహజ శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. అందుకే వేసవిలో దీనిని తరచుగా తింటారు. కానీ ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ ఇంకా చల్లగా ఉంటుంది. కొంతమందికి దీన్ని తిన్న వెంటనే దగ్గు, జలుబు, గొంతు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట చల్లటి పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మందగించడమే కాకుండా, అజీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అలాగే, ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఉదయం లేదా మధ్యాహ్నం పుచ్చకాయ తినడం మంచిది.

4 / 5
అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలోని తెలుపు, ఇతర భాగాలు పెద్దలలో అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిన విషయమే.

5 / 5
మీరు మొత్తం పుచ్చకాయ తినలేకపోతే, దాని రసం తీసి తాగడం మంచిది. మీరు పుచ్చకాయ ముక్కలను వడకట్టి నిల్వ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు తినడం వల్ల దాని పోషకాలు తగ్గుతాయి. అందుకే తాజా పుచ్చకాయ తినడం మంచి ఎంపిక. ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినడం వల్ల పోషకాలు తగ్గిపోయి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే పుచ్చకాయ కోసిన వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది.