
చలికాలంలో ఉసిరి కాయ వినియోగంతో రోగనిరోధక వ్యవస్థకు మంచిది. ఉసిరిలో ఉండే విటమిన్లు జలుబు వైరస్‌లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

ఉసిరి క్రోమియం మంచి మూలంగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేయడానికి పని చేస్తుంది. ఈ విధంగా, ఇది డయాబెటిక్ రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు దీనిని పచ్చిగా తీసుకోవచ్చు లేదా రసం, ఊరగాయ లేదా చట్నీ రూపంలో తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.

ఉసిరి చర్మాన్ని డీటాక్సిఫై చేస్తుంది. జుట్టును మెరిసేలా బలంగా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ఉసిరి విటమిన్ సి మూలకం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉసిరి విటమిన్ ఎ కు మంచి మూలం. ఇది మంచి కంటి దృష్టికి మేలు చేస్తుంది. ఉసిరి రసం రెగ్యులర్ వినియోగం మెరుగైన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వయస్సు సంబంధిత కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక ఫైబర్ పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే, కొందరు మాత్రం ఉసిరికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైపర్ ఎసిడిటీతో బాధపడుతున్నవారు ఉసిరిని తీసుకోరాదు. రక్త సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లయితే ఉసిరిని దూరం పెట్టాలి. ఉసిరికి రక్తాన్ని పలుచని చేసే గుణం వుంది కనుక శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తే తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు కూడా ఉసిరిని తినకూడదు. గర్భవతిగా లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే ఉసిరి కాయలు జోలికి వెళ్లకూడదు. పొడి చర్మం కలవారు ఉసిరిని తినరాదు. కొంతమందికి ఉసిరి తింటే అలెర్జీ వుంటుంది. అలాంటివారు ఉసిరిని తీసుకోకూడదు.