
హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్‌లను ఎందుకు వాడతారు. అంటే హోటల్ గదిల్లో ఉపయోగించే అన్ని బెడ్ షీట్లను ఒకేసారి కలిపి ఉతుకుతారు. ఆ సమయంలో బెడ్ షీట్లు వివిధ రంగులలో ఉంటే.. ఏవి ఎక్కువగా మురికిగా ఉన్నాయో గుర్తించడం అన్నా, మరకలు ఉన్నా గుర్తించడం కష్టం.

రగ్గులు తెల్లగా ఉండడం వలన సులభంగా ఉతకడం.. వాటి మీద ఉన్న మరకలు, ధూళిని గుర్తించడం సులభం అవుతుంది.

అంతే కాకుండా తెల్లటి బెడ్ షీట్లు పర్యాటకులకు ఎలాంటి మురికి లేకుండా శుభ్రంగా ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తాయి. అందువలన హోటల్ రూమ్ లో అతిథులు ప్రశాంతంగా నిద్రపోతారు. అలాగే తెలుపు రంగు అన్ని ఇతర రంగుల కంటే బాగా కనిపిస్తుంది.

హోటల్ గదిలోని ఫర్నీచర్ , వాల్ కలర్ వేర్వేరు రంగులలో ఉన్నప్పటికీ తెల్లటి బెడ్ షీట్లు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే హోటల్ లో బస చేసే అతిథులకు హోటల్ యాజమాన్యం గదులల్లోని పరిశుభ్రత గురించి తెలియజేస్తుంది.

1980ల ప్రారంభంలో తెల్లటి బెడ్ షీట్స్ ఫ్యాషన్ వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు రంగుల బెడ్ షీట్లు వాడేవారు. అయితే 1990 తర్వాత ఇంటీరియర్ డిజైనర్ల సలహా మేరకు హోటల్ గదులలో తెల్లటి బెడ్‌స్ప్రెడ్‌లు ఉపయోగించడం మొదలు పెట్టారు. వెస్టిన్ బ్రాండ్ 1990లలో హోటళ్ల కోసం తెల్లటి వస్త్రాలను ప్రాచుర్యంలోకి తెచ్చింది.