
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు అదిరిపోయే అద్భుతమైన ఫీచర్లను ను పరిచయం చేసింది. ఇకపై ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించకుండా.. యూజర్స్ తమ స్టేటస్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను కొలేజ్ చేసుకునే విదంగా.. ఇన్‌బుల్ట్ ఎడిటర్‌ను తీసుకొచ్చింది.

ఇప్పటి వరకు స్టేటస్‌లో ఒకటి మించి ఎక్కువ ఫొటోలు పెట్టుకోవాలంటే ఇతన థర్డ్ పార్టీ యాప్స్‌లో ఫోటోలను కొలేజ్ చేసి, ఎడిట్ చేసిన తర్వాత వాటిని వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోవాల్సి వచ్చేది. ఈ విషయంలో తమ యూజర్స్ ఇబ్బందిని గుర్తించిన వాట్సాప్ ఈ సమస్యను పరిష్కరించేందుకు స్టేటస్ విభాగంలో నాలుగు కొత్త ఫీచర్లను యాడ్ చేసింది.

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒకేసారి ఆరు ఫొటోల వరకు తమకు నచ్చిన విధంగా ఒకే ఫ్రేమ్‌లో అమర్చుకోవచ్చు. ఆ తర్వాత ఆఫోటోను డైరెక్ట్‌గా మన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ను మనం చాలా ఈజీగా యూజ్ చేయవచ్చు. మనం స్టేటస్ పెట్టేందుకు ఫోటోలను సెలెక్ట్ చేసుకునేప్పుడు.. స్క్రీన్‌పై మనకు కొత్తగా ‘లేఅవుట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఫోటోలను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మనకు నచ్చిన ప్రేమ్‌లలో సెట్‌చేసుకొని స్టేటస్ పెట్టుకోవాలి.

వీటితో పాటు మునుముందూ మ్యూజిక్ స్టిక్కర్లు, ఫొటో స్టిక్కర్లు వంటి మరిన్ని ఆకర్షణీయమైన సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కేవలం కొందరు యూజర్స్‌కు మాత్రమే ఈ కొత్త ఫీచర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ ఫీచర్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ తెలిపింది.