
నేటి బిజీ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం దాదాపు అసాధ్యంగా మారింది. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవి రోజువారీ జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపాలనుకుంటే ఏమి తింటున్నారన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రతిదీ మీరు ఏమి తింటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తినడం చాలా ముఖ్యం. ఉద్యోగం, ఇంటి పనులు, ఇతర బాధ్యతల కారణంగా ఆహారంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నాం. దీంతో చాలామంది ఉదయం అల్పాహారం కూడా దాటవేస్తుంటారు.

ఆరోగ్యానికి అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చాలా ముఖ్యమైనవి. అయితే చాలా మంది సరైన భోజనం కూడా తీసుకోకుండా నేరుగా ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటున్నారు. ప్యాక్ చేసిన చిప్స్ లేదా బిస్కెట్లు తినడానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అలాంటివి తినడం వల్ల భోజనం మానేసే ప్రమాదం ఉంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు వంటి సమస్యలు తలెత్తడంతో పాటు మన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

మ్రైకోవేవ్ చేసిన ఆహారాలు, ఇన్‌స్టాంట్ మీల్స్, ప్యాక్ చేసిన చీజ్, బ్రెడ్, ఫ్రోజెన్ పిజ్జా, కేక్స్, కుక్కీస్, చక్కెర కలిగిన తీపి పానీయాలు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకే వస్తాయి. వీటిని గర్బిణీలు తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యాయాలు వెల్లడించాయి.