Green Chilli: జీర్ణ ఆరోగ్యానికి పచ్చిమిర్చి.. ప్రతి రోజూ తిన్నారంటే మీ ఒళ్లు ఉక్కుమాదిరి తయారవుద్దంతే!

కాస్తంత కొరకగానే నషాలానికంటే ఘాటు పచ్చిమిర్చి సొంతం. అందుకే చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా కారం అంటే భయపడేవారు వీటి జోలికి అస్సలు వెళ్లరు. కానీ పచ్చిమిర్చీ తింటే ఒంట్లో చాలా రోగాలు చిటికెలో మాయం అవుతాయని చాలా మందికి తెలియదు. మిర్చీ రుచికి ఘాటుగా ఉన్నా ఇవి చేసే మేలు అంతాఇంతా కాదు..

|

Updated on: Oct 27, 2024 | 8:06 PM

పచ్చి మిర్చిలో విటమిన్ ఎ, సి, బి-1, బి-1, బి-3, బి-5, బి-6, బి-9, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. అలాగే, పచ్చి మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం నొప్పులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

1 / 5
పచ్చి మిరపకాయలు జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు మన పూర్తికులు. అవును.. నిజంగానే పచ్చి మిర్చి కడుపు సంబంధిత సమస్యలకు బలేగా పనిచేస్తుంది. చాలా మంది వర్షాకాలంలో ఎసిడిటీ, మలబద్ధకం వంటి అనేక సమస్యలతో బాధపడుతుంటారు. వారు పచ్చి మిరపకాయలను తీసుకోవచ్చు. పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పీచు జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

2 / 5
పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

3 / 5
ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పచ్చి మిరపకాయలు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.

4 / 5
వేసవిలో చాలా మంది హీట్ స్ట్రోక్‌తో బాధపడుతుంటారు. కాబట్టి పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ సమస్య నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రోజువారీ ఆహారంలో పచ్చిమిర్చి చేర్చుకోవాలనుకునే వారు రోజుకు 3 నుంచి 4 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. అతిగా తింటే గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. పైల్స్‌తో బాధపడే వారు పచ్చి మిరపకాయలు వంటి మసాలా ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

5 / 5
Follow us