- Telugu News Photo Gallery Mental Health: Helping Someone During a Panic Attack, Here are some ways to help them
Panic Attack: మీకెప్పుడైనా తీవ్ర భయం, ఆందోళనగా అనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి! 2 నిమిషాల్లో నార్మల్ అవుతారు
మనస్సు త్రికరణాలలో ఒకటి. దీనిని అదుపు చేయడం అంత సులువు కాదు. పగ్గాలులేని గుర్రంలా పరుగులు తీసే మనసు ఒక్క క్షణం సంతోష సాగరంలో మునకలు వేస్తుంది.. మరుక్షణంలోనే దుఃఖ జలధిలో పడిపోతుంది. కరుణామృతాన్ని వర్షించే మనసు క్రోధాగ్నికి కారణభూతమవుతుంది. అందుకే దీనికి కళ్లెం వేసిన వారు మహాత్ములవుతారు..
Updated on: Oct 27, 2024 | 8:20 PM

స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గురించి అవగాహన చాలా అవసరం. అయితే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వ్యక్తిని గుర్తించడం ద్వారా వారి మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది.

ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. బదులుగా నీళ్లు, హెర్బల్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. అలాగే పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

శరీరం, మనస్సు ఒత్తిడి నుండి కోలుకోవడానికి వీలుగా రాత్రి సమయంలో కనీసం 7-9 గంటల నిద్ర చాలా అవసరం. ధ్యానం, లోతైన శ్వాస, యోగా మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఒత్తిడిని ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ముఖ్యంగా సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఓ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా దీనిని తయారు చేసుకోవాలి.

మీ చుట్టుపక్కల లేదా ఇంట్లో ఎవరైనా భయాందోళనకు గురవుతున్నట్లు అనిపిస్తే.. మీరు వారి ప్రవర్తనను చూస్తే దూరంగా ఉండకండి. బదులుగా ఆ వ్యక్తిని సౌకర్యవంతమైన కుర్చీ లేదా సోఫాలో కూర్చోబెట్టి.. కాసేపు మీరు వారితో గడపడానికి ప్రయత్నించాలి.




