
నేటి కాలంలో అధిక బరువు ఓ పెద్ద సమస్యగా మారింది. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే, ఈ జ్యూస్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.

ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలు. బరువు తగ్గే విషయానికి వస్తే అందులో ఆహారం పాత్ర చాలా కీలకం. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఆహారాన్ని తప్పక మార్చుకోవాలి.

ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బీట్‌రూట్, ఉసిరి, కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే వేగంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలా తయారు చేయాలంటే..

బీట్‌రూట్‌తో కూడా వివిధ వంటకాలు తయారు చేసుకోవచ్చు. బీట్‌రూట్‌తో పాటు, పాలకూర కూడా రక్త పరిమాణాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలకూరను ఆహారంలో వివిధ మార్గాల్లో తీసుకోవడం ద్వారా రక్త పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది.