- Telugu News Photo Gallery What happens in the body if you drink hot tea and coffee? Check Here is Details
Hot Tea and Coffee: వేడి వేడి టీ, కాఫీలు తాగితే శరీరంలో ఏం జరుగుతుందంటే..
చాలా మంది వేడి వేడి టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల మంచి కిక్క్ వస్తుంది. ఇలా వేడివి తాగడం వల్ల అనేక సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
Updated on: Nov 28, 2024 | 7:03 PM

ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగపోతే చాలా మందికి తెల్లవారదు. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ పడాల్సిందే. అన్నం తిన్నా తినకపోయినా టీ తాగపోతే మూడ్ అస్సలు మారదు. కొంత మంది నాలుగైదు సార్లు టీ, కాఫీలు తాగుతారు. అది కూడా పొగలు కక్కుతూ ఉండేలా తాగుతారు.

స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, మధుమేహం, చిత్తవైకల్యం, మేజర్ డిప్రెషన్‌ను నివారించడంలోనూ కాఫీ సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి కాఫీ, కెఫిన్ మాత్రమే కారణం కాదు. వాటి సానుకూల ఆరోగ్య ప్రభావాలు జీవిత నాణ్యతను మెరుగుపరిచే మార్గాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

వేడి వేడి టీ లేదా కాఫీలు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వేడివి తాగితే.. అన్నవాహిక కూడా దెబ్బతింటుందట. మరీ వేడివి కాకుండా.. వేడి తక్కువగా ఉండే టీ, కాఫీలు తాగడం మంచిది.

జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని గ్యాస్, అల్సర్లు, మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయి. వేడి టీ, కాఫీలు తాగితే అన్న వాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు పరిశోధనలు తెలిపాయి.

ఎక్కువగా వేడి పానీయాలు తాగడం వల్ల గొంతు, నోరు, కడుపు పొరకు హాని కలుగుతుంది. ఆడవారు కూడా ఎక్కువగా వేడి టీ, కాఫీలు తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. గర్భిణీలు అస్సలు వేడివి తాగకూడదు. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




