Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ కిచెన్‌లో ఈ మార్పులు చేయండి చాలు..

|

Aug 08, 2024 | 1:04 PM

తరచూ బయటి ఆహారం తినడం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా బరువు వేగంగా పెరగటానికి దారితీస్తుంది. బరువు పెరగడానికి అనారోగ్యకరమైన ఆహారం మాత్రమే కారణం కాదు.. క్రమరహిత జీవనశైలి కూడా ఓ కారణమే. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అధిక బరువు వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు దాడిచేస్తాయి. కాబట్టి ఊబకాయం గురించి తెలియకుండా..

1 / 5
తరచూ బయటి ఆహారం తినడం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా బరువు వేగంగా పెరగటానికి దారితీస్తుంది. బరువు పెరగడానికి అనారోగ్యకరమైన ఆహారం మాత్రమే కారణం కాదు.. క్రమరహిత జీవనశైలి కూడా ఓ కారణమే. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అధిక బరువు వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు దాడిచేస్తాయి. కాబట్టి ఊబకాయం గురించి తెలియకుండా బరువును అదుపులో ఉంచుకోవడం అసాధ్యం.

2 / 5
బరువు తగ్గాలనుకుంటే ఆహారాన్ని మార్చుకోవాలి. రోజువారీ వ్యాయామం కూడా చేయాలి. అయితే ఆహారంతో పాటు వంటగదిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. సరైన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ప్యాక్ చేసిన ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ కొనకూడదు. ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలను మాత్రమే ఉంచాలి. ఆకలితో ఫ్రిజ్‌ని తెరిచినప్పుడల్లా, ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే మీకు కనిపిస్తుంది.

3 / 5
బరువు తగ్గాలంటే ఆహారంలో నూనెను తగ్గించాలి. ఇష్టం వచ్చినంత నూనె పోయకండి. ఒక చెంచా నూనె ఉపయోగించండి. నూనె, ఉప్పు, పంచదారను మితంగా ఉపయోగించడం వల్ల కూడా బరువు నివారించవచ్చు. అలాగేపప్పులు, చేపలు, మాంసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో సలాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. విడిగా సలాడ్ తయారు చేయలేకపోయినా, దోసకాయ, టమోటా, ఉల్లిపాయ వంటి పండ్లు, కూరగాయలను కట్ చేసి తినడానికి ఉపయోగించాలి.

4 / 5
భోజనం సమయంలో చిన్న ప్లేట్లు వాడాలి. అన్ని రకాల ఆహారాన్ని తీసుకోండి కానీ తక్కువ పరిమాణంలో తీసుకోండి. ప్లేట్ నిండా ఆహారం తీసుకుంటే కడుపుతోపాటు మనస్సు రెండింటినీ నింపుతుంది.

5 / 5
మైదా, శీతల పానీయాలు, పంచదార, ఐస్‌క్రీం, కుకీస్ వంటి ఆహారపదార్థాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇంట్లో కేలరీల ఆహారాలు ఉంచుకోకూడదు. మీరు రుచికరమైన ఆహారం తినాలనుకుంటే, ఇంట్లో తయారు చేసుకోని తినవచ్చు.