- Telugu News Photo Gallery Weight gain tips: consume these things daily your weight will increase soon
బక్కచిక్కి సన్నగా ఉన్నారా..? ఇలా చేస్తే అదిరిపోయే ఫిజిక్ మీ సొంతం..
కొంతమంది ఎంత ప్రయత్నించినా లావు కాలేరు. లావుగా మారేందుకు బయట దొరికే పౌడర్లు, మందులు తీసుకుంటారు. కానీ అధిక మందులు తీసుకోవడం శరీరానికి ప్రమాదకరం. సన్నగా ఉండటం.. బరువు పెరగకపోవడం లాంటి సమస్యలు కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతోంది. మీరు తక్కువ బరువు ఉండటం.. క్రమంగా సన్నబడటం లాంటి వల్ల ఇబ్బంది పడుతుంటే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..
Updated on: Apr 09, 2024 | 1:52 PM

కొంతమంది ఎంత ప్రయత్నించినా లావు కాలేరు. లావుగా మారేందుకు బయట దొరికే పౌడర్లు, మందులు తీసుకుంటారు. కానీ అధిక మందులు తీసుకోవడం శరీరానికి ప్రమాదకరం. సన్నగా ఉండటం.. బరువు పెరగకపోవడం లాంటి సమస్యలు కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతోంది. మీరు తక్కువ బరువు ఉండటం.. క్రమంగా సన్నబడటం లాంటి వల్ల ఇబ్బంది పడుతుంటే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈరోజు మేము మీకు కొన్ని సులభమైన పరిష్కారాలను తెలియజేస్తాము. వీటిని ఫాలో అవ్వడం ద్వారా సులభంగా బరువు పెరగవచ్చు. సన్నబడటానికి, బరువు పెరగడానికి, మీరు పోషకమైన ఆహారాన్ని తినాలి. అటువంటి ఆహారంలో అధిక మొత్తంలో కేలరీలు కలిగి ఉంటాయి. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది.

బరువు పెరగాలంటే ఇలా చేయండి: మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, నట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి కార్బోహైడ్రేట్లను తినండి. ఇది మీకు శక్తిని ఇస్తుంది.. చిరకు బరువు పెరుగేలా చేస్తుంది.

రోజువారీ వ్యాయామం: ఇవన్నీ కాకుండా, మీరు కండరాలను బలోపేతం చేయడానికి, ఆకలిని పెంచడానికి సహాయపడే వ్యాయామాలు చేయాలి. మీరు కార్డియో వ్యాయామం కూడా చేయవచ్చు. ఇది బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. మీరు తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం కూడా బరువు తగ్గడానికి దారితీస్తుంది.. ఇది కండరాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

ఆహారం: బంగాళదుంపలు, బియ్యం ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీ బరువు క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. మాస్ గెయినర్ వంటి కొన్ని ఆహారాలు బరువు పెరగడంలో సహాయపడతాయి. మీరు రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.. అంతేకాకుండా సమయానికి అనుగుణంగా భోజనం తినాలి.

జీవనశైలిని మెరుగుపరుచుకోండి: బరువు పెరగడానికి, మీరు మీ జీవనశైలిని స్థిరంగా ఉంచుకోవాలి. సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రలేవడం, ప్రతి పనిని సమయానికి చేయడం చాలా ముఖ్యం. ఈ చర్యలన్నింటినీ అనుసరించడం ద్వారా మీరు క్రమంగా మీ బరువును పెంచుకోవచ్చు. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుందని గమనించాలి.. ఈ చర్యలన్నింటినీ ప్రయత్నించినప్పటికీ మీకు ఉపశమనం లభించకపోతే.. మీ సన్నబడటం పోకపోతే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.




