
కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న వన్యప్రాణులకు నీటి సరఫరా చేస్తున్నారు. జంతువులు, పక్షులు, మనుషులు తాగేందుకు అడవుల్లో నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. నీరులేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కర్ణాకటలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా జోడాలాల్, హనమంత్‌పూర్ గ్రామస్తులు వినూత్న ప్రకృతి సేవ చేస్తున్నారు. వీరు చేస్తున్న పనితో అందరి ప్రశంసలను అందుకుంటున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర కరువు అలుముకుంది. మనుషులు మాత్రమే కాదు జంతువులు, పక్షులు కూడా తాగేందుకు ఇక్కడ నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. నీరులేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి

నోరులేని మూగజీవులు పడుతున్న ఇబ్బంది చూసి చన్నగిరి తాలూకా జోడాలాల్, హనమంతపూర్ గ్రామస్తుల మనసు విలవిలలాడింది. నోరు లేని జీవుల దాహార్తిని తీర్చాలని భావించి వినూత్నంగా ప్రకృతి సేవ చేయడం మొదలు పెట్టారు.

జోడల్, హనమంత్‌పూర్ గ్రామస్థులు తమ ఇళ్ల నుంచి మూగజీవులు, వన్యప్రాణులకు తాగేందుకు నీటిని సరఫరా చేస్తున్నారు.

ఈ రెండు గ్రామాలకు చెందిన కొంతమంది బిందెల్లో నీటిని నింపుకుని అడవిలోకి వెళ్లి జంతువుల దాహార్తిని తీరుస్తున్నారు.

జోలదాల్, హనుమంతనగర్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి గ్రామస్తులు తాము తీసుకెళ్లిన నీటిని జంతువులు తాగే నీటి గుంతలో వేశారు.

అయితే ఓ వైపు అనేక గ్రామాల్లో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గుక్కెడు నీరు తాగడానికి లేక తాము అల్లాడుతుంటే.. వన్యప్రాణులకు నీటి సరఫరా చేయడంపై రెండు గ్రామాల గ్రామస్తులపై సమీపంలోని కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.