OTP చెబితే.. గ్యాస్ సిలిండర్లు మాయం! వైజాగ​్‌లో ఏం జరిగిందో తెలుసా..?

Edited By:

Updated on: Mar 28, 2026 | 10:45 PM

పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగి, సరఫరాలో ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో, విశాఖపట్నంలో మణికంఠ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ అప్పారావు 30 సిలిండర్లను మోసపూరితంగా OTPలు సేకరించి పక్కదారి పట్టించాడు. డెలివరీ బాయ్ వివరాలు లేకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

1 / 5
పశ్చిమాసియాలో యుద్ధం పుణ్యమా అని భయంతో గ్యాస్ బుకింగ్స్ సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. గ్యాస్ సిలిండర్లు కొడతా ఉంటుందనే భయంతో ముందే బుక్ చేసుకుంటున్నారు వినియోగదారులు. దీంతో డిమాండ్ కు సప్లై కు వ్యత్యాసం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో డెలివరీ సమయం కూడా ఆలస్యం అవుతుంది. వంట గ్యాస్ కు భారీ డిమాండ్ ఏర్పడడంతో దీంతో కొన్నిచోట్ల బ్యాక్ డోర్ లో చేతివాటం చూపిస్తూనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ కూడా గుట్టుగా  వినియోగిస్తున్నాడంతో ఇప్పుడు వంట గ్యాస్ కు మరింత డిమాండ్ పెరిగిపోతుంది.  పౌరసరఫరాల అధికారులు దాడులు చేసినా ఇంకా కొన్నిచోట్ల  డొమెస్టిక్స్ సిలిండర్లు పక్కదారి పడుతూనే ఉన్నాయన్నది జనం చెబుతున్న మాట. గ్యాస్ కు ఉన్న డిమాండ్‌తో కొంతమంది డెలివరీ బాయ్ లు కూడా సొమ్ము చేసుకుంటున్నారు. వైజాగ్ లో ఓ డెలివరీ బాయ్ చేసిన పనికి అటు పోలీసులు పరుగులు పెడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

2 / 5
విశాఖ గాజువాక చిన్న గంట్యాడ ప్రాంతంలో మణికంఠ గ్యాస్ ఏజెన్సీస్ నిర్వహిస్తున్నారు. ఇండేన్ గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సప్లై చేస్తూ ఉన్నారు. బుక్ చేసుకున్న సిలిండర్లను కొంతమంది నేరుగా వచ్చి తీసుకెళ్తుంటే మరి కొంతమంది గ్యాస్ డెలివరీ బాయ్ లతో టచ్ లో ఉంటూ డోర్ డెలివరీ చేయించుకుంటున్నారు వినియోగదారులు. ప్రతిరోజు వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ జరుగుతున్నాయి. అయితే తాజాగా మణికంఠ ఏజెన్సీ లో పనిచేస్తున్న డెలివరీ బాయ్ అప్పారావు చేసిన పని ఇప్పుడు అందరిని పరుగులు పెట్టిస్తోంది. డెలివరీ చేయాల్సిన గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించి పరారయ్యాడు డెలివరీ బాయ్ అప్పారావు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 సిలిండర్లతో పారిపోయాడు. వాటిలో ఫీలింగ్స్ సిలిండర్లు, మరికొన్ని కాలేజీ సిలిండర్లు కూడా ఉన్నాయి.

3 / 5
డెలివరీ బాయ్ అప్పారావు వినియోగదారులతో చాలా చనువుగా ఉండేవాడట. దీంతో అందరూ నమ్మకంగా ఉంటున్నారని విశ్వసించారు. అదే వారికి కొంపముంచిది. వాస్తవానికి ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చిన తర్వాత.. కస్టమర్లకు వచ్చిన ఓటీపీని తెలుసుకొని ఆ సిలిండర్లను గ్యాస్ డెలివరీ బాయ్ కస్టమర్లకు అప్పగించాలి. ఆన్లైన్లో డబ్బులు చెల్లించకపోతే స్పాట్లోనే డెలివరీ బాయ్ కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న  గ్యాస్ డిమాండ్ తో ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు మెజార్టీ శాతం వినియోగదారులు. దీంతోపాటు ఓటీపీ చెప్తేనే డెలివరీ చేస్తున్నారు. ఇదే అదనంగా చేసుకున్న డెలివరీ బాయ్ అప్పారావు.. కస్టమర్ల చనువుతో.. అప్పారావు ముందే ఓటిపి అడిగి తీసుకున్నాడు. అటు కస్టమర్లకు.. ఇటు గ్యాస్ ఏజెన్సీకి నమ్మకస్తుడుగా ఉండడంతో గ్యాస్ సిలిండర్లను డెలివరీ బాయ్ కి అప్పగించారు ఏజెన్సీ నిర్వాహకులు. కస్టమర్ల నుంచి ఓటీపీలు తెలుసుకొని ఖాళీ సిలిండర్లను కలెక్ట్ చేసుకున్న అప్పారావు.. ఏజెన్సీ నుంచి ఫిల్ చేసిన సిలిండర్లను మూట కట్టుకుని ఒక్కసారిగా మాయమైపోయాడు.

4 / 5
గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ల కోసం ఆత్రుతగా వేచి చూస్తున్న వినియోగదారులు డెలివరీ బాయ్ అప్పారావు ట్రాప్ లో పడిపోయారు. ‘అమ్మగారు మీకు గ్యాస్ వచ్చిందండి.. మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ చెప్పండి.. ఈరోజే డెలివరీ చేసేస్తాను’ కాల్ చేశాడు కస్టమర్లకు డెలివరీ బాయ్ అప్పారావు. అప్పటికే సిలిండర్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వినియోగదారులంతా.. కాల్ వచ్చిన వెంటనే  అప్పారావుకు ఓటిపిని చెప్పేశారు. గ్యాస్ డెలివరీ అవుతుందని వేచి చూస్తున్నరు కస్టమర్లు. ఎంతకీ గ్యాస్ డెలివరీ కాకపోవడంతో డెలివరీ బాయ్ కి కాల్ చేశారు. దీంతో డెలివరీ బాయ్ మొబైల్ స్విచ్ ఆఫ్. తీవ్ర ఆందోళన చెందిన వినియోగదారులు మణికంఠ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించారు. వారం రోజులు క్రితమే గ్యాస్ డెలివరీ చేసినట్టు ఏజెన్సీ నిర్వాకులు కస్టమర్లకు సమాధానం చెప్పడంతో మరోసారి షాక్ అయ్యారు. అసలు విషయాన్ని చెప్పడంతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

5 / 5
సమాచారం అందుకున్న సివిల్ సప్లై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి విచారించారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. ఎందుకంటే గ్యాస్ డెలివరీ బాయ్ అప్పారావుకు సంబంధించిన వివరాలు గ్యాస్ ఏజెన్సీ వద్ద లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఏజెన్సీ లో పనిచేస్తున్న డెలివరీ బాయ్ అప్పారావు కస్టమర్ల నుంచి ఓటిపిలు ఖాళీ సిలిండర్లు తీసుకొని.. ఫిల్లింగ్ సిలిండర్లు ఇవ్వడం లేదని మాకు ఫిర్యాదు. 15 రోజుల క్రితం మందలించాం.. ఐదు సిలిండర్లను రికవరీ చేశాం. ఇంకా 30 మంది వరకు కస్టమర్లకు డెలివరీ చేయలేదని  మా ఏజెన్సీ కి వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసాం. ప్రస్తుతం డెలివరీ బాయ్ పరారీలో ఉన్నాడు అని అన్నారు మణికంఠ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు. గ్యాస్ సిలిండర్లా డైవర్షన్పై దర్యాప్తు జరుగుతోంది. డెలివరీ బాయ్ అప్పారావు కస్టమర్ల నుంచి ఓటిపిలు సేకరించి గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లాడు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి అన్నయ్య సిలిండర్ ఏర్పాటు చేశాం, గ్యాస్ సిలిండర్ల ఓటీపీలు డెలివరీ సమయంలోనే చెప్పండి. ఎక్కడైనా ఎటువంటి సమస్య ఉంటే ఫిర్యాదు చేయండి అని అన్నారు తహసీల్దార్ శ్రీనివాస్.

Follow Us