Hippopotamus: నీటి ఏనుగు నోట్లో ప్లాస్టిక్‌ బాటిల్‌ విసిరేసిన మహిళ.. మండిపడుతోన్న నెటిజెన్లు..

|

Mar 13, 2021 | 9:01 PM

Bottle Throwing In Hippopotamus Mouth: కొన్ని సందర్బాల్లో మనుషులు చేసే పనులు చూస్తుంటే అసలు వీరు మనుషులేనా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మూగ జీవులపై కొందరు చేసే అమానుష చర్యలు మనిషి తాలుకు మానవత్వాన్నే..

Hippopotamus: నీటి ఏనుగు నోట్లో ప్లాస్టిక్‌ బాటిల్‌ విసిరేసిన మహిళ.. మండిపడుతోన్న నెటిజెన్లు..
Hippopotamus Mouth
Follow us on

Bottle Throwing In Hippopotamus Mouth: కొన్ని సందర్బాల్లో మనుషులు చేసే పనులు చూస్తుంటే అసలు వీరు మనుషులేనా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మూగ జీవులపై కొందరు చేసే అమానుష చర్యలు మనిషి తాలుకు మానవత్వాన్నే ప్రశ్నిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని ఓ సఫారీ పార్కును సందర్శించడానికి వెళ్లింది ఓ మహిళ. ఈ క్రమంలో నీటి ఎనుగు (హిప్పోటామస్‌) ఉన్న ప్రదేశానికి వెళ్లింది. అయితే అంతసేపు బాగానే ఉన్న ఆ మహిళ నీటి ఎనుగును చూసేసరికి చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ను దాని నోట్లోకి విసిరేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ మహిళ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. మూగజీవిపై ఆ మహిళ చేసిన దుశ్చర్య పట్ల నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వాన్ని మరిచిన ఆ మహిళ తీరుపట్ల అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సదరు మహిళ మాట్లాడుతూ.. ‘నేను చూస్తుండగానే ఆ మహిళ నీటి ఎనుగు నోట్లోకి బాటిల్‌ విసిరింది. నేను ఆ సమయంలో మహిళను అడ్డుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక ఆ మహిళ కేవలం వాటర్‌ బాటిల్‌ కాకుండా ఇతర చెత్త పదార్థాలను కూడా హిప్పోటామస్‌ నోట్లోకి విసిరింది. ఈ సంఘటను చాలా మంది ప్రత్యక్షంగా చూశారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Gold ornaments seized: జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు.. 234 కిలోల బంగారు అభరణాల పట్టివేత

LockDown: భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన అధికారులు..

Health Tips: ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు అస్సలు తినకూడదట.. తింటే ప్రమాదమేనంటున్నారు నిపుణులు..!