Wimbledon 2021: వింబుల్డన్ ‘స్పైడర్ మ్యాన్‌’ ని చూశారా..? నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదుగా!

|

Jul 01, 2021 | 6:45 PM

ప్రపంచంలోని టాప్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్.. ప్రస్తుతం వింబుల్డన్ 2021 లో వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తూ.. పురుషుల సింగిల్స్‌ లో ట్రోఫీ కోసం ముందుకు సాగుతున్నాడు.

Wimbledon 2021: వింబుల్డన్ స్పైడర్ మ్యాన్‌ ని చూశారా..? నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదుగా!
Novak Djokovic Spiderman Memes
Follow us on

Wimbledon 2021: వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ (వింబుల్డన్ 2021) గత సోమవారం నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభమైంది. సెర్బియాకు చెందిన నోవాక్ జొకోవిచ్.. మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. 19 గ్రాండ్‌స్లామ్‌లను ఇప్పటికే తన ఖాతాలోవేసుకున్న నోవాక్.. ప్రస్తుతం తన 20 వ గ్రాండ్‌స్లామ్‌ కోసం వేటను కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థులపై ఏస్‌ల వర్షం కురిపిస్తూ.. చాలా ఏకాగ్రతగా కనిపిస్తుంటాడు. అలాగే మైదానంలో చాలా ఉల్లాసంగా కదులుతుంటాడు. వింబుల్డన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌తో నోవాక్ జొకోవిచ్ 15 వ సారి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. జొకోవిచ్ దక్షిణాఫ్రికాకు చెందిన కె. అండర్సన్ 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించి తరువాతి రౌండ్‌లోకి ఎంటర్ అయ్యాడు. నోవాక్ ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం వింబుల్డన్ లో గ్రాండ్ స్లామ్ గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తాజాగా ఓ నోవాక్ జకోవిచ్ ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్ట్ నడుస్తోంది. నోవాక్ జకోవిచ్‌ ను ఏకంగా స్పైడర్‌ మ్యాన్‌తో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫొటోను ట్విట్టర్లో నోవాక్ జకోవిచ్ తన ఖాతాలో షేర్ చేశాడు. దీనికి ‘ స్పైడర్ మ్యాన్ రిటర్న్స్ హా..హా..హా.. మీమ్స్ ఫెస్ట్ మొదలుపెట్టండి అంటూ’ క్యాప్షన్ చేర్చాడు. ఈ ఫొటో లో అచ్చం స్పైడర్‌ లాగే పాకుతున్నట్లుగా షాట్ ఆడాడు. ఈ సూపర్ స్టార్ ప్లయరే అలా క్యాప్షన్ ఇస్తే.. నెటిజన్లు ఊరుకుంటారా..! మీమ్స్‌ తో వాళ్ల క్రియోటివిటీకి పదును పెట్టి మరీ మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు.

Also Read:

Hyderabad FootBall Club: డానిష్ బ్రాండ్ తో హైదరాబాద్ ఎఫ్‌సీ ఒప్పందం; హెచ్‌ఎఫ్‌సీ కిట్ స్పాన్సర్‌గా హమ్మెల్!

Michael Vaughan: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ వక్రబుద్ధి; కోహ్లీపై మరోసారి..! ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్

World Test Championship: రెండవ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ షురూ.. ఈ సారి మార్పులు ఇవే..!

Lords Cricket Stadium: టెస్టు మ్యాచ్ లో టీ20 సునామీ.. ఒక్కరోజులో 3 సెంచరీలు, 500 పరుగులతో సంచలనం..!