
భారతదేశంలో పెట్రోలు-డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. కానీ రూ.100 కంటే తక్కువకు విక్రయించే నగరాలు కూడా ఇండియాలో ఉన్నాయి.

చమురు కంపెనీలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. వరుసగా రెండో రోజు సామాన్యులకు ఊరట లభించింది.

అండమాన్, నికోబార్‌లో పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువగా ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ రూ.90.03 చొప్పున విక్రయిస్తున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో పెట్రోలు100 రూపాయల కంటే తక్కువకు విక్రయిస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ ధర రూ.99.77 ఉంది. త్వరలో ఇక్కడ కూడా రూ.100 దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
