Viral Photo: ఈ సృష్టిలో ఎలాంటి స్వార్థం లేని ప్రేమ ఒక్క తల్లిదే అంటారు. పిల్లల కోసం తల్లి పడే ఆరాటం ముందు మరే ప్రేమ సాటిరాదని చెబుతుంటారు. తన ఆరోగ్యం ఎలా ఉన్నా.. పిల్లల ఆరోగ్యం కోసం అనుక్షణం పరితపిస్తూనే ఉంటుంది అమ్మ. ఈ క్రమంలోనే తను అనారోగ్యం బారిన పడినా ఇంటి సభ్యుల కోసం ఓపిక చేసుకొని మరీ వంటలు చేసి పెడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అనుక్షణం కృషి చేస్తూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో తల్లి ప్రేమకు నిదర్శనంగా కనిపిస్తోంది. అయతే ఇదే క్రమంలో కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఓ మహిళకు కరోనా చికిత్సలో భాగంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే నోటికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంది. అయితే ఓ వైపు నోటికి మాస్కు ఉన్నా.. వంట గదిలో నిల్చొని చపాతీలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న మహిళ విశ్రాంతి తీసుకోకుండా వంట చేస్తున్న ఈ ఫొటో చూసిన కొందరు. అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది, ఈ సృష్టిలో సెలవు లేని ఉద్యోగం ఒక్క అమ్మపోస్ట్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మరికొందరు మాత్రం సదరు మహిళ కుటుంబసభ్యులను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ మహిళ కుటుంబ సభ్యులను వెంటనే జైళ్లో వేయాలని, ఆమెను ఆసుపత్రిలో చేర్చాలంటున్నారు.
Wtf is this shit?
Let the woman rest jeez. pic.twitter.com/hnj2qRQyvp— Navin Noronha ?? (@HouseOfNoronha) May 21, 2021
This is criminal. Put all the family members in jail. And put her in a hotel with all amenities.
— KCT (@ketaki0805) May 21, 2021
Also Read: Earthquake: భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ సరిహద్దు రాష్ట్రం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన మణిపురి జనం…
Gas Cylinder: జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా..? అసలు కారణమేంటో తెలుసా..?