Vinayaka Chaviti 2024: వినాయకుడిని ప్రతిష్టించే పూజ గదిని, మండలపాలను అలంకరించేందుకు సింపుల్ ఐడియాలు మీ కోసం

|

Aug 28, 2024 | 6:12 PM

వినాయక చవితి కోసం పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల చతుర్థి తిథి నాడు చవితి తిధి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. వినాయక చవితి రోజున హిందువులు తమ ఇళ్లలో శ్రేయస్సు, ఆనందం, అదృష్టానికి చిహ్నంగా భావించే గణేశుడిని ప్రతిష్టిస్తారు. ఇళ్ళలో మాత్రమే కాదు బహిరంగ ప్రదేశాలు, దేవాలయాల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం తమ ఇళ్ళలోని పూజా గదిని, పందిర్లను, ఆలయాలను, మండపాలను, దేవాలయాలను చాలా అందంగా ఆకర్షించే విధంగా అలంకరిస్తారు.

1 / 6
మండపాల్లోని లేదా ఇంట్లో ప్రతిష్టించే వినాయకుని విగ్రహాన్ని పూలు, పండ్లు, స్వీట్లు, వివిధ రకాల నైవేద్యాలతో అలంకరిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజన కీర్తనలు కూడా నిర్వహిస్తారు. పదో రోజుల పాటు జరిగే గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. ఈ సంవత్సరం మీ ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్లయితే ఇంటిలో పూజ గదిని, ఇంటి అలంకరణ కోసం ఈ చిట్కాలను అనుసరించండి.

2 / 6
పూజ కోసం సరైన స్థలం: విగ్రహ ప్రతిష్టలో మొదటి ఘట్టం.. వినాయకుడి విగ్రహాన్ని ఉంచడానికి ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి. ఈ స్థలం శుభ్రంగా ఉండాలి. అలాగే ఇక్కడ స్థలం కూడా సరైన దిశలో ఉండాలి. అంతేకాదు వినాయక పూజ, దర్శనం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేలా చూసుకోవాలి.

3 / 6
రంగురంగుల దుస్తులు: వినాయకుని పూజించే స్థలంలో రంగురంగుల వస్త్రాలతో అలంకరించవచ్చు. అందమైన చీరలు, దుపట్టాలు వంటివి ఉపయోగించవచ్చు. అలంకరణ కోసం అనేక రకాలుగా డిజైన్స్ గా ఏర్పాటు చేసి వెనుక గోడపై ఉంచవచ్చు. గణేశుడిని ప్రతిష్టించే ప్రదేశంలో పవిత్రమైన, అందమైన బట్టలతో అలంకరించండి.

4 / 6
రంగు రంగుల పూల ఏర్పాటు: వినాయకుని విగ్రహం చుట్టూ రంగురంగుల పూలతో అలంకరించవచ్చు. బంతి పువ్వు, గులాబీ, చామంతి, మల్లె పువ్వులను ఉపయోగించవచ్చు. ఇవి పూజకు కూడా మంగళకరమైనవిగా భావిస్తారు. అలాగే పువ్వుల సువాసన ప్రార్థనా స్థలంలో వ్యాపించి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలంకరణ కోసం కృత్రిమ పుష్పాలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు వినాయకుడిని ప్రతిష్టించే గోడను అలంకరించడానికి కృత్రిమ పుష్పాలను ఉపయోగించవచ్చు.

5 / 6
లైటింగ్: ఇంట్లోనే కాకుండా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశంలో కూడా రంగురంగుల లైట్లను అమర్చండి. ముఖ్యంగా గణేశుడి విగ్రహం చుట్టూ లైటింగ్ సహాయంతో ప్రార్ధనా స్థలాన్ని అలంకరించవచ్చు.

6 / 6
రంగు కాగితాలు-బెలూన్లు: వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో అలంకరణ కోసం రంగు కాగితాలను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం రంగుల కాగితాలతో పూలు, ఫ్యాన్లు, ఫ్రిల్స్, గొడుగులు, సీతాకోక చిలుకలు, వాల్ హ్యాంగింగ్స్ వంటి వాటిని తయారు చేసి అలంకరణకు వాడితే 10 రోజుల పాటు అలాగే అందంగా కనువిందు చేస్తాయి. అంతేకాదు రకరకాల బెలూన్లతో గణపతిని ప్రతిష్టించే ప్రాంతంలో అలంకరించు కోవచ్చు. రంగురంగుల బెలూన్లతో గోడలను అలంకరించవచ్చు. దీని కోసం మీరు రెండు అపోజిట్ రంగుల బెలూన్లను ఉపయోగించి అలంకరిస్తే మరింత అందంగా కనిపిస్తాయి.