
తాబేలు: వాస్తు ప్రకారం ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌కు ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలు ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇలా చేయడం వలన ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని.. విజయ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని .. ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని నమ్మకం.

కామధేనువు : హిందూ మతంలో ఆవును పూజిస్తారు. గోమాతగా గౌరవిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఇంట్లో ఇత్తడి కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచినట్లయితే అది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో ఆనందం, సిరి సంపదలను కలిగిస్తుంది.

ఏనుగు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో సిరి, సంపదలను పెంచుతుంది. సానుకూల శక్తిని తెస్తుంది.

హంసల జత: వాస్తు ప్రకారం డ్రాయింగ్ రూమ్‌లో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచినట్లయితే.. అది మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. అదే సమయంలో ఇంట్లో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచడం వల్ల వాహిక జీవితం సంతోషకరంగా సాగుతుంది.

చేప: వాస్తు ప్రకారం లోహపు చేపలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం. లోహపు చేపలను ఇంట్లో ఉంచే వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సంపదను పెంచుకోవడానికి ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఉంచవచ్చు.