
ఇంట్లో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కానీ దానిని ఎక్కడ ఉంచాలనే దానిపై వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా మంది రాత్రిపూట లేదా సౌలభ్యం కోసం చీపురును పడకగదిలో ఉంచుతారు. కానీ ఈ చిన్న పొరపాటు మీ జీవితంలో పెద్ద సమస్యలను సృష్టిస్తుందట.

పడకగది భార్యాభర్తల మధ్య ప్రేమకు నిలయం. అక్కడ చీపురు ఉంచడం వల్ల వారిద్దరి మధ్య అనవసరమైన గొడవలు, ఉద్రిక్తతలు పెరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో చీపురు ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు నిలవదు. అనవసరమైన ఖర్చులు పెరిగి, ఆర్థిక పురోగతి ఆగిపోతుంది.

చీపుర్లు గదిలోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మనశ్శాంతి లభించదు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే దీనికి గల కారణాలలో పడకగదిలోని చీపురు కూడా ఒకటి కావచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఎల్లప్పుడూ ఇంటి పడమటి దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. చీపురును ఎప్పుడూ నిటారుగా ఉంచవద్దు, దానిని ఎల్లప్పుడూ అడ్డంగానే ఉంచాలి. చీపురును ఎవరూ సులభంగా గమనించని చోట ఉంచాలి. దానిని దాచి ఉంచడమే ఎల్లప్పుడూ మంచిది. మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సు కావాలంటే, ఈరోజే మీ బెడ్‌రూంలోని చీపురును సరైన స్థానంలోకి మార్చండి.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.