
హిందూ సంప్రదాయాల ప్రకారం పండుగల సమయంలో ఇంటిని ప్రతి ఒక్కరూ అందంగా, పసుపు, కుంకుమ, పూలు దీపాలతో అందంగా అలంకరించుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? మరి పండుగల సమయంలోనే ఎక్కువగా ఇంటిలో దీపాలు ఎందుకు వెలగిస్తారో, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

పండుగల సమయంలో దీపాలను వెలిగించడం అనేది చాలా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా చిన్న కాంతి ఇంటిలోపల పాజిటివ్ ఎనర్జీని పెం చుతుంది. అందుకే మన పెద్ద వారు పండుగల సమయంలో తప్పకుండా దీపాలు వెలిగించాలని చెబుతుంటారు. ఇవే కాకుండా పండుగల సమయంలో దీపాలు వెలగించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.

చిన్న దీపం చీకటిని తొలిగిస్తుంది. అంతే కాకుండా పండుగల సమయంలో దీపాల వెలుగులు చీకటిని తొలిగించి, ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతే కాకుండా దీపాల వెలుగులు ఇంటిలోని ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతతను పెంచి జీవితంలోని బాధలను దూరం చేస్తాయంట.

వాస్తు ప్రకారం, ప్రకృతిలోని ఐదు అంశాలలో అగ్ని ఒకటి. దీపం వెలిగించినప్పుడు, అగ్ని శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, దీంతో ఇది వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, స్వచ్ఛత, సానుకూల శక్తిని కూడా తీసుకొస్తుందంట. అదే విధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం దీపం వెలిగించడం వల్ల రాహువు, శని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని, బృహస్పతి లేదా సూర్యుడి వంటి గ్రహాలు సానుకూల ప్రభావాలను పెంచుతాయంట. ఇది ఇంటికి చాలా మంచిదంట.

పండుగ సమయంలో దీపం వెలిగించడం అనేది దేవుడిని పలకరించే ఒక మార్గం అంటున్నారు పండితులు. అది మీ భక్తి , ప్రేమ,గౌరవాన్ని ప్రదర్శిస్తుందంట. అంతే కాకుండా ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఆరోగ్యాన్ని పెంచుతుందంట. అందుకే పండగల సమయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలంట.