
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువుల్లో అద్దం ఒకటి. ఇది కాంతిని ప్రతిబింబిస్తుంది. అయితే ఈ అద్దం ఉండే దిశ కూడా ఆ ఇంటి పై సానుకూల, ప్రతి కూల ప్రభావాన్ని చూపిస్తుందంట. కాబ్టి ఇంటిలోపల అద్దం ఏ దిశలో ఉండాలి? ఏ దిశలో ఉండటం వలన సంపద పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు లేదా తూర్పు దిశ వైపున ఉన్న గోడకు అద్దం ఉంచడం చాలా శుభప్రదం అంట. దీని వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవహించి, ఇంటిలోపల ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుందంట. అంతే కాకుండా తూర్పు లేదా ఉత్తరం దిశ వైపున అద్దం పెట్టడం వలన సంపదకూడా పెరుగుతుందంట.

అలాగే అద్దం ఎప్పుడూ కూడా బెడ్ రూమ్ లేదా బెడ్ ముందు పెట్టకూడదంట. ఇలా పెట్టడం వలన అశాంతి, మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా, వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అందుకే వీలైనంత వరకు బెడ్ రూమ్‌లో అస్సలే అద్దం పెట్టకూడదంట.

లివింగ్ రూమ్ లో అద్దం పెట్టడం వల్ల చాలా మంచిదంట. వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్ రూమ్‌లో అద్దం పెట్టడం వలన ఇంట్లో సంపద పెరుగుతుందంట. ఎందుకంటే ఇది వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం పెట్టడానికి లివింగ్ రూమ్ చాలా ఉత్తమమైనదంట. అలాగే లివింగ్ రూమ్‌లో అద్దం పెట్టడం వలన గది అందం పెరగడమే కాకుండా, దాని శక్తి కూడా పెరి, సానుకూలతను ఇస్తుందంట.

డైనింగ్ టేబుల్ పక్కన అద్దం ఉంచడం కూడ మంచిదంట. దీని వలన శ్రేయస్సు, సంపద పెరుగుతుంది. అలాగే ఇంట్లో చిన్న కారిడార్ ఉంటే అక్కడ అద్దం అమర్చడం కూడా మంచిదంట. దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు పండితులు.