Valentine Day: ఎరుపు, గులాబీ, పసుపు…ఏ రంగు గులాబీకి ఏ అర్దమో తెలుసా..! ఎవరు ఏ పువ్వు ఇవ్వాలంటే

|

Feb 04, 2024 | 12:19 PM

ప్రేమికులు ఎంతో ఇష్టంగా ఎదురు చూసే ప్రేమికుల రోజుకి ఇక పది రోజులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ వీక్ ను జరుపుకోవడానికి ఉత్సాహంగా ప్రేమికులు రెడీ అవుతున్నారు. ప్రేమికులు వారం రోజుల ముందు నుంచో ఒకొక్క రోజుని ఒకొక్క విధంగా జరుపుకోవడానికి ఆసక్తిని సి చూపిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 14 వరకు ప్రేమికుల వారోత్సవంగా జరుపుకుంటారు. మొదటి రోజుని రోజెస్ డే గా జరుపుకుంటారు. 

1 / 6
రోజెస్ డే రోజున స్పెషల్ గిఫ్ట్స్, గులాబీలను ఇచ్చి పుచ్చుకుని ఒకరికొకరు తమ భావాలను వ్యక్తం చేస్తారు.  ఎరుపు గులాబీలు గుర్తుకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ తమ ప్రేమ భాగస్వామిని గుర్తుకు తెచ్చుకుంటారు.  కానీ మీకు తెలుసా తెలుపు, పసుపు, గులాబీ... గులాబీలలో ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది. ఈ విధంగా గులాబీలను ఇవ్వడం ద్వారా మీ భావాలను వ్యక్తపరచవచ్చు. మీ భాగస్వామికి కానీ ఇతరులకు కూడా.

2 / 6
వాలెంటైన్స్ వీక్, రోజ్ డే, ప్రపోజ్ డే, వాలెంటైన్స్ డే అనే మూడు రోజులలో ప్రజలు ఒకరికొకరు గులాబీలను ఇవ్వడం ద్వారా తమ హృదయపూర్వక భావాలను వ్యక్తం చేస్తారు. చాలా మందికి ఎరుపు గులాబీ పువ్వుకి  అర్థం తెలుసు. అయితే పసుపు, తెలుపు, గులాబీ వంటి రంగుల గులాబీ పువ్వులకు అర్థం మీకు తెలుసా. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు మీ భావాలను మీ స్నేహితుడికి లేదా మీ ప్రేమ భాగస్వామికి కాకుండా కొత్త వ్యక్తికి తెలియజేయాలనుకుంటే .. గులాబీ పువ్వులను కొనుగోలు చేసే ముందు.. గులాబీ పువ్వు రంగు బట్టి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.. 

3 / 6
ఎరుపు గులాబీ పువ్వు: ప్రేమ , శృంగార భావాలను వ్యక్తం చేయాలనుకుంటే ఎరుపు గులాబీ పువ్వులను గిఫ్ట్ ఇస్తారని అందరికీ తెలుసు. కనుక ఎవరైనా తమ లవర్ కి గులాబీ పువ్వులు ఇవ్వాలనుకుంటే లేదా మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు మీ భావాలను వ్యక్తం చేయాలనుకుంటే లేదా ప్రపోజ్ చేయాలనుకుంటే.. ఎరుపు గులాబీ పువ్వులు ఎంచుకోవాలి. 

4 / 6
పసుపు గులాబీ పువ్వు స్నేహానికి నాంది: ఈ ప్రేమికుల రోజున మీరు ఎవరితోనైనా స్నేహాన్ని ప్రారంభించాలనుకుంటే పసుపు గులాబీ పువ్వు దీనికి బెస్ట్ ఎంపిక. పసుపు గులాబీ పువ్వులు ఏదైనా సంబంధంలో కొత్త ప్రారంభాన్ని తెలియజేస్తాయి. 

5 / 6
గులాబీ రంగు గులాబీ పువ్వు:  గులాబీ రంగు గులాబీ పువ్వులు ఆకర్షణ, ఆనందం, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తాయి. మీ భాగస్వామిని కలిగి ఉన్నందుకు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో.. వారి సంబంధం మీకు ఎంత ముఖ్యమైనదో మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే.. గులాబీ రంగు గులాబీ పువ్వుని ఎంచుకోవచ్చు. మీరు తోబుట్టువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మొదలైన వారికి గులాబీ గులాబీలను ఇవ్వవచ్చు. అంతేకాదు మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పటికీ.. దానిని వ్యక్తపరచలేకపోతే.. వారికి గులాబీ గులాబీలను బహుమతిగా ఇవ్వవచ్చు.

6 / 6

తెల్ల గులాబీ పువ్వు:  ఇప్పుడు రోజ్ డే రోజున తెల్ల గులాబీలను ఇవ్వడం పక్కన పెట్టేశారు. అయితే  ఈ రంగు పువ్వు  శాంతి, స్వచ్ఛతను చూపుతుందని..  అవతలి వ్యక్తి  పట్ల స్వచ్ఛమైన భావాలను పంచుకోవడానికి తెల్ల గులాబీలను ఇవ్వవచ్చు. అదే సమయంలో క్షమాపణ కోరడానికి తెల్ల గులాబీలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.