- Telugu News Photo Gallery US President Joe Biden, First Lady Jill Biden welcome PM Modi inside the White House see Photos
PM Modi US Visit: ఇది 140 బిలియన్ల భారతీయులకు దక్కిన గౌరవం.. ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా శ్వేతసౌధంలో ఘనస్వాగతం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా శ్వేతసౌధంలో ఘనస్వాగతం.. ప్రధాని మోదీ పర్యటన భారత్-అమెరికా మధ్య మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసింది. వైట్‌హౌస్‌లో మోదీకి ఘనస్వాగతం పలికారు బైడెన్ దంపతులు. రక్షణ, వాణిజ్యరంగాల్లో పలు ఒప్పందాలనే ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
Updated on: Jun 22, 2023 | 9:52 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా శ్వేతసౌధంలో ఘనస్వాగతం లభించింది.

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ , ఆయన సతీమణి జిల్ బైడెన్ ఘనస్వాగతం పలికారు.

వైట్‌హౌస్‌లో గౌరవవందనం స్వీకరించారు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు, అక్కడ అధ్యక్షుడు బిడెన్ ఆయనకు ముక్తకంఠంతో స్వాగతం పలికారు.

అమెరికాతో ఇప్పటికే పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు మోదీ. జెట్ ఇంజిన్ల డీల్, డ్రోన్ డీల్ రక్షణరంగంలో చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు.

శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారతీయ ఎన్‌ఆర్ఐలు. కుటుంబాలతో సహా కలిసి వచ్చారు. ఈ వేడుకకు చిన్నపిల్లలు కూడా అక్కడి రావడంతో వాతావరణ సందడిగా మారింది.

భిన్నత్వంలో ఏకత్వానికి భారత్-అమెరికా దేశాలు ప్రతీక అని అన్నారు మోదీ. రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే అన్నారు . అమెరికాలో 40 లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని , ప్రవాస భారతీయులను చూసి గర్వంగా ఉందన్నారు మోదీ.
