Vajrasana Uses: వజ్రాసనంతో నమ్మలేని నిజాలు.. ఎన్నో సమస్యలకు చెక్!
వజ్రాసనం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ యోగాసనం వేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఒక పది నిమిషాలు ఈ ఆసనం వేసినా ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో, వెయిట్ లాస్ అవ్వడంలో సహాయ పడుతుంది..
Updated on: Jan 19, 2025 | 1:59 PM

యోగాసనాల్లో వజ్రాసనం కూడా ఒకటి. యోగా ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యోగాతో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి రోజూ వజ్రాసనం వేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ ఆసనం ఎంతో చక్కగా పని చేస్తుంది.

ప్రతిరోజూ ఓ పది నిమిషాలు వజ్రాసనం వేయడం వల్ల ఒత్తిడి అనేది కంట్రోల్ అవుతుంది. ఒత్తిడితో బాధ పడేవారు ప్రతి రోజూ ఈ ఆసనం వేయడం వల్ల మంచి రిలీఫ్ దక్కుతుంది. జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అజీర్తి సమస్య తగ్గుతుంది.

ఆహారం సరిగా అరగని వారు ఈ ఆసనం వేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వెయిట్ లాస్ కూడా అవుతారు. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ ఆసనం వేయడం వల్ల నడుము, పొట్ట, తొడల భాగంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే క్రాంప్స్ కూడా కంట్రోల్ అవుతాయి. మూత్రనాళ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. వెన్ను నొప్పి అనేది కూడా తగ్గుతుంది. తొడలు, మోకాళ్లు, పిక్కలు బలోపేతం అవుతాయి.

గర్భిణీలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ ఆసనం వేస్తే కాన్పు అనేది తేలికగా అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. సయాటికా నొప్పి కూడా కంట్రోల్ అవుతుంది. నడుము నొప్పి సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేస్తే తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




