Chinni Enni |
Nov 29, 2024 | 12:45 PM
చాలా మందిని వేధించే సమస్యల్లో పొడి దగ్గు కూడా ఒకటి. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఒక్కోసారి పొడి దగ్గు అనేది అస్సలు కంట్రోల్ కాదు. దీని వలన బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పొడి దగ్గును మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు.
పొడి దగ్గు కారణంగా గొంతు కూడా నొప్పి పుడుతుంది. నీటిని తాగినా కూడా గొంతుకు దగ్గర పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా అనిపిస్తూ ఉంటే గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్ప కలిపి.. గొంతు దగ్గర కాసేపు నీటిని ఉంచి పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి.
పొడి దగ్గును తగ్గించడంలో నెయ్యి, మిరియాల పొడి కూడా చక్కగా పని చేస్తుంది. కొద్దిగా నెయ్యిలో మిరియాల పొడి కలిపి.. చిటికెడు ఉదయం, రాత్రి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
అదే విధంగా అల్లం కూడా పొడి దగ్గను తగ్గించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. అల్లంలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి పొడి దగ్గును తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసి ఉప్పు, తేనె కలిపి తినాలి.
పొడి దగ్గు లేదా గొంతు నొప్పిని కంట్రోలో చేయడంలో పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంట గుణాలు ఉంటాయి. గోరు వెచ్చటి నీటిలో పసుపు కలిపి గొంతు వద్ద ఉంచి పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేస్తే పొడి దగ్గు తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)