
పల్లెటూరి వంటల్లో పొలం పచ్చడి చాలా ఫేమస్. ఇక పొలాల్లో దొరికే కూరగాయలు, తాజా ఆకుకూరలు, పచ్చిమిర్చితో చేస్తే ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేడి అన్నంలో అయితే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకుని తినండి జన్మలో మర్చిపోరు.

పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 10 పచ్చిమిర్చి , రెండు ఉల్లిపాయలు, మంట తగ్గడం కోసం టమాటాలు, 8 వెల్లుల్లి రెబ్బలు , ఒక కప్పు కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు , మూడు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు , రెండు ఎండు మిర్చిని తీసుకోవాలి.

పచ్చిమిర్చి - ఉల్లిపాయ ముందుగా పచ్చిమిర్చిని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండును కూడా ఒకేసారి కడిగి గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి అది బాగా నానబెట్టుకోవాలి. గుజ్జు మంచిగా వచ్చేలా దీనిని నాననివ్వాలి. ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీసి దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇంకా దీనిలో చింతపండు గుజ్జును వేసి మిక్సీ పడితే మంట తగ్గుతుంది.ఉల్లిపాయ, కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టి పోపు పెట్టుకుని, అది వేయించిన తరవాత ఈ పచ్చడి మీద పోయాలి. అంతే, రోటి పొలం పచ్చడి రెడీ తింటే సూపర్ అని అనాల్సిందే.

ఈ పచ్చడిని వేడి అన్నంలో కలిపి తింటే ముద్ద ముద్దకు స్వర్గమే. ఇంకా జొన్న రొట్టెలు, రాగి సంగటితో ఉంటే రుచిగా ఉంటుంది. ఇంకా దీనిలో సహజమైన పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే, ఆకలి కూడా పెంచుతుంది. గ్రామీణ స్టైల్లో చేసే ఈ పచ్చడి రుచికరంగా ఉంటుంది.