Rameshwaram: రామేశ్వరం వెళ్తున్నారా.. రామాయణంతో సంబంధం ఉన్న వీటిని చూడకపోతే యాత్ర అసంపూర్ణం

Updated on: Jul 08, 2025 | 7:27 PM

రామేశ్వరం తమిళనాడులోని ఒక పవిత్ర తీర్థయాత్ర స్థలం. ఈ ప్రదేశం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథస్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. దీనిని "దక్షిణ కాశి" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి రోజూ దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే రామనాథ స్వామిని దర్శించుకుని వెంటనే తిరిగి ప్రయాణం అవుతున్నారా.. సమీపంలోని ఈ ప్రదేశాలను చూడకపోతే మీ యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఎందుకంటే రామేశ్వరం సమీపంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు, అందమైన ప్రదేశాలున్నాయి.

1 / 6
భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడిని సందర్శించడం ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ధనుష్కోడి రామనాథస్వామి ఆలయం నుంచి దాదాపు 3.5 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మీరు కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. దీనితో పాటు ధనుష్కోడి బీచ్ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. మన్నార్ గల్ఫ్ మెరైన్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది.  ( Credit : Getty Images )

2 / 6
జటాయు తీర్థం రామేశ్వరంలోని ప్రధాన ఆలయాలలో ఒకటి. ఇది సీతాదేవిని ఎత్తుకేల్తున్న రావణుడి నుంచి సీతాదేవిని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పక్షి రాజు జటాయువుకు అంకితం చేయబడింది. ఇది రామనాథస్వామి ఆలయం నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.  జటాయువుకి అంకితం చేయబడిన ఏకైక ఆలయాన్ని సందర్శించడం మరచిపోకండి. (Credit : travelandleisureindia)

3 / 6
విల్లుండి తీర్థం రామేశ్వరంలో ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలం. దీనిని 'సముద్రం మధ్యలో ఉన్న తీపి నీటి బావి' అని కూడా పిలుస్తారు. ఇక్కడ సీతాదేవి దాహం తీర్చడానికి రాముడు తన విల్లుతో సముద్రంలో బావిని తవ్వినట్లు పురాణం చెప్తుంది. ఇది రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి 6 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంది. దీనిని త్రయంబకేశ్వర అని పిలుస్తారు.  (Credit : travelandleisureindia)

4 / 6
 
అరియామన్ బీచ్ ను కుషి బీచ్ అని కూడా పిలుస్తారు. ఇది రామేశ్వరం ద్వీపంలోని పాక్ బే ఒడ్డున ఉన్న ఒక అందమైన బీచ్. ఇది ప్రశాంతమైన అలలు, ఇసుక తీరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం రామేశ్వరం నుంచి దాదాపు 27 కి.మీ దూరంలో ఉంది.  ( Credit : Getty Images )

5 / 6
పంబన్ వంతెన భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన. ఇది రామేశ్వరం నుంచి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని చుట్టూ ఉన్న దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. మీరు ఇక్కడ గాజు పడవలో ప్రయాణించే అవకాశం పొందవచ్చు . ఇక్కడి నుంచి సూర్యాస్తమయ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది.  ( Credit : Getty Images )

6 / 6
సీ వరల్డ్ అక్వేరియం రామేశ్వరంలో చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది రామేశ్వరం బస్ స్టాండ్ ఎదురుగా ఉంది. ఇది ఆదివారాలు , నెలలో రెండవ శనివారంలో  మూసివేయబడుతుంది. చేపలు, పగడాలు, స్పాంజ్‌లు, పీతలు, సన్యాసి పీతలు, ఇతర జలచరాలను ఇక్కడ చూడవచ్చు.  ( Credit : Getty Images )