ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన డ్రైఫ్రూట్స్‌లోఎండుద్రాక్ష ఒకటి. ఈ డ్రైఫ్రూట్‌లో విటమిన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మన ఆరోగ్యానికి మంచి చేసే మరెన్నో పోషకాలు నిండి ఉన్నాయి . ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఒక గ్లాసు నానబెట్టిన ఎండుద్రాక్ష నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.