
ఎక్కువ చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం: శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బిస్కెట్లు, కేకులు, చాక్లెట్, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

అధిక కేలరీలు, తక్కువ ఫైబర్ కలిగిన ఆహారం: మీరు రోజూ ఎక్కువ కేలరీలు తీసుకుంటుంటే లేదా మీ ప్లేట్‌లో తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, ఎక్కువ వేయించిన, పిండి, శుద్ధి చేసిన నూనె ఉన్న ఆహారం ఉంటే, అప్పుడు ఇన్సులిన్‌పై ఒత్తిడి ఉంటుంది. ఇది డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

నిశ్చల జీవనశైలి: ప్రస్తుత కాలంలో చాలా మంది శారీరక శ్రమను మానేషారు. తక్కువ నడవడం, గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇవన్నీ మధుమేహంతో పాటు అనేక ఇతర వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. దీని వల్ల ఉదర కొవ్వు (విసెరల్ ఫ్యాట్) నేరుగా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. అందువల్ల, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి బరువు నిర్వహణ తప్పనిసరి అని సిఫార్సు చేయబడింది.

నిరంతరం ఒత్తిడి: ప్రస్తుత బిజీలైఫ్, జాబ్ టెన్షన్‌తో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. మీ శరీరంలోని ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఈ దీర్ఘకాలిక ఒత్తిడి మీ మధుమేహ ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతుంది.

నిద్రలేకపోవడం: అలాగే నిద్ర లేకపోవడం కూడా డయాబెటీస్ వచ్చేందుకు ప్రధాన కారణం. సరిగ్గా నిద్రలేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. రోజుకు 5–6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీనితో పాటు ధూమపానం మద్యపానం వంటి అలావాట్లు కూడా దీనికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.