Tooth Pain: చలికాలంలో భరించ లేనంతగా పంటి నొప్పి.. వీటితో పరార్!

|

Jan 04, 2025 | 5:41 PM

వింటర్ సీజన్‌లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో పంటి నొప్పి కూడా ఒకటి. పంటి నొప్పి వచ్చిందంటే మనిషి మనిషిలో ఉండడు. మాట్లాడేందుకు, తినేందుకు ఆఖరికి మంచినీళ్లు తాగేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నొప్పి ఇంటి చిట్కాలతోనే చాలా త్వరగా తగ్గించుకోవచ్చు..

1 / 5
శీతా కాలంలో జలుబు, దగ్గు, జ్వరం, చెవి నొప్పితో పాటు నోటి సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి.  పంటి నొప్పి, చిగుళ్ల వాపు, కొండ నాలుక, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. వీటిల్లో పంటి నొప్పి చాలా బాధిస్తుంది. ఏమీ తినలేం, తాగలేం.

2 / 5
పంటి నొప్పి కారణంగా చెవి దగ్గర నుంచి గొంతు వరకు నొప్పిగా ఉంటుంది. ఎటూ కదలించ లేని పరిస్థితి ఉంటుంది. పెద్దగా మాట్లాడలేం కూడా. ఇలాంటి పంటి నొప్పిని మనం ఈజీగా ఇంట్లో ఉండే ఔషధాలతో తగ్గించుకోవచ్చు.

3 / 5
పసుపు నీటితో పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసి మరిగించాలి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు.. పంటి నొప్పి వస్తున్న దగర నీటిని ఓ ఐదు నుంచి పది నిమిషాలు ఉంచాలి. ఇలా గ్యాప్ ఇస్తూ మీకు వీలు ఉన్నప్పుడల్లా చేస్తే.. కాస్త ఉపశమనం లభిస్తుంది.

4 / 5
ఉప్ప నీరు కూడా పంటి నొప్పిని తగ్గించడంలో ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. ఉప్పు వేసి మరిగించిన నీటిని పంటి నొప్పి ఉన్న చోట ఓ ఐదు నిమిషాలు ఉంచాలి. ఇలా తరచూ చేస్తే పంటి నొప్పి తగ్గుతుంది. ఈ ఉప్పు నీటితో కాపడం పెట్టిన నొప్పి తగ్గుతుంది.

5 / 5
అల్లం రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనె కలిపి.. పంటి నొప్పి వచ్చే దగ్గర రాయాలి. ఇలా గ్యాస్ ఇస్తూ ఎన్ని సార్లు రాసినా మంచిదే. అలాగే లవంగం నూనె ఉన్నా కూడా పంటి నొప్పి దగ్గర రాస్తూ ఉన్నా పంటి నొప్పి అనేది తగ్గుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అల్లం రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనె కలిపి.. పంటి నొప్పి వచ్చే దగ్గర రాయాలి. ఇలా గ్యాస్ ఇస్తూ ఎన్ని సార్లు రాసినా మంచిదే. అలాగే లవంగం నూనె ఉన్నా కూడా పంటి నొప్పి దగ్గర రాస్తూ ఉన్నా పంటి నొప్పి అనేది తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)