- Telugu News Photo Gallery To avoid infectious diseases during the monsoon season, you must eat these foods
వర్షాకాలంలో అంటు వ్యాధుల భయమా.. ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధుల గురించి భయాందోళనకు గురి అవుతుంటారు.ఎందుకంటే ఈ కాలంలో అనేక వ్యాధులు దరి చేరుతుంటాయి. అయితే అంటు వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం
Updated on: May 31, 2025 | 9:04 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. అయితే వాతావరణం మారుతున్నప్పుడు చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అందువల రోగనిరోధక శక్తి పెరిగే మంచి ఫుడ్ తీసుకోవాలంట.అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ మీ వంటల్లో చేర్చుకొని తినడం వలన సీజనల్ వ్యాధుల రాకుండా అడ్డుకుంటుందంట. అందుకే వర్షాకాలంలో తప్పకుండా వెల్లుల్లి తినాలంట.

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. వర్షాకాలంలో అల్లం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అంతే కాకుండా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందంట. అందుకే వర్షాకాలంలో తప్పకుండా అల్లం తినాలంట.

సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందంట. దీని వలన వీటిని తినడం వలన వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయంట. అందుకే తప్పకుండా సిట్రస్ ఫ్రూట్స్ తినాలంట.

వర్షకాలంలో బయట ఫుడ్ అస్సలే తినకూడదంట. దీని వలన అనేక సమస్యలు దరి చేరే అవకాశం ఉన్నదంట. అందుకే సీజనల్ ఫ్రూట్స్ తినాలంట. అలాగే బాదం తప్పకుండా ప్రతి రోజూ తినాలంట.



