
ఎవరికైతే నరదిష్టి తగిలిందని అనిపిస్తుందో, అలాంటి వారు ప్రతి శని వారం తమ ఇంటి ప్రధాన ద్వారం వద్దలేదా వారు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లైతే, ఆ వ్యాపార ప్రధాన ద్వారం వద్ద ఏడు మిరపకాయలు, ఒక నిమ్మకాయను నల్లదారానికి కట్టి వేలాడ దీయాలంట. దీని వలన ఇది ప్రతి కూల శక్తిని లోనికి రాకుండూ చేస్తుందంట. అయితే ఈ నిమ్మకాయ, మిరపకాయల దండను వారానికి ఒకసారి మార్చుతూ ఉండాలంట.

నరదిష్టి పోవాలంటే, ప్రతి కూల శక్తి ఇంటిలోకి రాకూడదంటే, ఒక గాజు గిన్నె తీసుకొని అందులో ఉప్పు లేదా పటికను నింపి ఇంటిలోని ఈశన్య మూలలో ఉంచాలి. దీని వలన ఇది ప్రతి కూల శక్తిని ఆకర్షించి, చెడు దృష్టి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతి పది రోజులకు ఒకసారి ఈ ఉప్పును మార్చుతూ ఉండాలంట.

ఇంటి ముందు పచ్చటి మొక్కలు ఉంచడం కూడా చాలా మంచిది. మీ ఇంటికి చెడు దృష్టి ఉన్నదని అనిపిస్తే మీ ఇంటి ముందు లేదా, ఈ శాన్య దిశలో తులసి మొక్కను నాటాలంట. ఇదే కాకుండా మనీ ప్లాంట్, కలబంద, వంటి వాటిని నాటడం వలన ఇవి సానుకూలతను పెంచుతాయి. చెడు దృష్టి ప్రభావాన్ని తగ్గిస్తాయి.

మీరు అనుకున్న పనులు సరిగ్గా జరగకపోయినా, ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నా, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని అనిపిస్తే,. అలాంటి వారు ఐదు నల్ల మిరియాలను తీసుకోని మీ తలపై నుంచి ఏడు సార్లు తిప్పుకొని, నాలుగు మూలలకు నాలుగు పారేసి, ఒకటి పైకి ఆకాశంలోకి విసిరేయాలి. దీని వలన చెడు కన్ను ప్రభావం తొలిగిపోతుందంట.

ఇంటి తలుపుల మీద వాస్తు యంత్రం ఉంచడం వలన కూడా ప్రతి కూల శక్తి ఇంటిలోకి ప్రవేశించదని చెబుతున్నారు పండితులు. అందుకే ఇంటి ప్రధాన ద్వారానిక స్వస్తిక్, శుభ్, లాభ్ ,ఓం వంటి చిహ్నాలను ఉంచాలంట.