- Telugu News Photo Gallery These zodiac signs should perform special pujas during the month of Ashada
ఆషాఢమాసం బోనాలు స్టార్ట్.. తప్పకుండా చేయాల్సిన పూజలివే!
భాగ్యనగరం బోనమెత్తడానికి రెడీ అయ్యింది. డప్పు చప్పుల్లు, పోతరాజుల ఆటలు, శివసత్తుల ఆటపాటలు, మేకపోతులతో ఆ అమ్మవార్లకు పూజలు చేయడానికి హైదరాబాద్ ముస్తాబ్ అవుతుంది. ఈ సమయంలో రాష్ట్రంలోని వారందరూ భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి అమ్మవార్లను పసుపు, కుంకుమలతో కొలుచుకుంటారు. పంట, పిల్లా,ఆరోగ్యం అన్నీ బాగుండాలని కోరుకుంటారు. అయితే ఈ మాసంలో తప్పకుండా కొన్ని పూజలు చేయాలంట అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Jun 14, 2025 | 12:26 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 12వ తేదీ నుంచే ప్రారంభమై, జూలై 10న ముగుస్తుంది. ఇక ఈ సమయంలోనే హైదరాబాద్‌లోని ప్రతీ దేవాలయంలో బోనాలతో, పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ గ్రామీణదేవతలను కొలుచుకుంటారు. అయితే ఈ మాసంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటారని, పండతులు చెబుతారు. అందుకే ఈ మాసంలో చాలా వరకు పండగలు జరపరు.

కానీ ఈ మాసంలో తెలంగాణలో మాత్రం ప్రతి రోజూ పండుగే, ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో గ్రామీణ దేవతలకు పూజలు నిర్వహిస్తారు. అయితే గ్రహసంచారం ప్రకారం చూస్తే ఈ సారి ఆషాఢమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందంట. అయితే ఈ మాసంలో సూర్యుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తారు. అందువలన పలు రాశుల వారు ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందంట.

వృషభ రాశి : గ్రహ సంచారం ప్రకారం ఆషాఢ మాసంలో వృషభ రాశి వారికి జాక్ పాట్ తగల నుంచి. ఈ రాశి వారు గ్రామ దేవతలను, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట. ఆర్థికంగా కలిసి వస్తుందంట. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. లక్ష్మీ కటాక్షం వలన వ్యాపరస్తులు లాభాలు అందుకుంటారు.

సింహ రాశి : ఆషాఢ మాసంలో సింహ రాశి వారు ప్రతి రోజూ ఒక దేవతను పూజించాలంట. దీని వలన వీరు అనేక లాభాలు పొందుతారు అంటున్నారు పండితులు. ముఖ్యంగా అమ్మవార్లకు బియ్యం పోసి పట్టుబట్టలు సమర్పించడం వలన వీరికి ఏ కోరిక కోరినా నెరవేరుతుందంట. విద్యార్థులకు కలిసి వస్తుంది.

తుల రాశి : గ్రహసంచారం ప్రకారం ఈ మాసంలో అదృష్టం కలిసి వచ్చే రాశుల్లో తుల రాశి ఒకటి. ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శించడం వలన మానసిక ప్రశాంతత దొరకుతుంది. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది.



