- Telugu News Photo Gallery These five green leaves can cure diseases like diabetes cholesterol and others in Telugu
Health Care Tips: పరగడుపునే వీటిని తీసుకుంటే ఆ సమస్యలు పరార్..
Health Care Tips: అనారోగ్యకరమైన జీవనశైలి, పోషకాహార లేమి వల్ల మధుమేహం, చెడు కొలెస్ట్రాల్, హైబీపీ వంటి తీవ్రమైన వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో పాటు కొన్ని సహజ చిట్కాలు పాటించడం ఎంతో మంచిది
Updated on: Apr 08, 2022 | 7:39 PM

తులసి ఆకులు: నోటి దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులు తినాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందులో ఉన్న ఔషధ గుణాలు దంతాల రక్తస్రావం తగ్గిస్తాయి. అదేవిధంగా నోటిని తాజాగా ఉంచుతాయి.

కరివేపాకు: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు కరివేపాకును రోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి

వెల్లుల్లి ఆకులు: భారతదేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తోన్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈక్రమంలో క్యాన్సర్ నుంచి రక్షణ పొందాలంటే వెల్లుల్లి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఔషధ గుణాలు పెద్దప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

జిన్సెంగ్ ఆకులు: ప్రస్తుతం చాలామంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు జిన్సెంగ్ ఆకులు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వేప ఆకులు: మధుమేహ వ్యాధిగ్రస్తులు వేప ఆకులను తీసుకోవడం మంచిది. వేపలో ఉండే గుణాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా రోజూ 4 నుండి 5 వేప ఆకులను తీసుకోవాలి.




