Chicken: చికెన్‌లోని ఈ పార్ట్స్‌ని అస్సలు తినొద్దు.. పొరపాటున్న తిన్నా అంతే సంగతులు..

Updated on: Jan 04, 2026 | 7:04 PM

నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైనది చికెన్. రెడ్ మీట్‌తో పోలిస్తే చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని చాలామంది దీనిని క్రమం తప్పకుండా తింటుంటారు. అయితే చికెన్ తినేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోడి శరీరంలోని కొన్ని భాగాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

1 / 6
ప్రపంచవ్యాప్తంగా చికెన్ అంటే కోడి మాంసం తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు వివిధ రకాల చికెన్‌ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. వాటిలో బిర్యానీ, చికెన్ టిక్కా, చికెన్ ఫ్రై వంటి  వివిధ రకాల వంటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి.

2 / 6
మెడ భాగం: మెడ భాగంలో ఉండే మాంసం రుచిగా ఉంటుందని చాలామంది సూప్‌లలో వేసుకుంటారు. అయితే కోడి శరీరంలో బ్యాక్టీరియా ఎక్కువగా నిల్వ ఉండే భాగాలలో మెడ ఒకటి. దీనిని పూర్తిగా శుభ్రం చేయడం చాలా కష్టం, కాబట్టి దీనిని నివారించడం మంచిది.

3 / 6
తల - కాలి వేళ్లు: కోళ్లు తినే ఆహారం, అవి పెరిగే వాతావరణం వల్ల వాటి తల భాగంలో పురుగుమందుల అవశేషాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇవి నిరంతరం నేలపై, మురికిలో ఉండటం వల్ల దుమ్ము, ధూళి, ప్రమాదకరమైన సూక్ష్మజీవులు వీటిలో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది

4 / 6
పేగులు - ఊపిరితిత్తులు: కోడి పేగులలో బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారక క్రిములు అధికంగా ఉంటాయి. మీరు ఎంత కడిగినా ఇవి పూర్తిగా శుభ్రపడవు. అలాగే ఊపిరితిత్తులలో పరాన్నజీవులు ఉంటాయి. ఇవి ఉడికించినా చనిపోవు. అందుకే ఈ భాగాలను పూర్తిగా దూరం పెట్టాలి.

5 / 6
గుండె భాగం: చికెన్ హార్ట్‌లో ప్రోటీన్లు ఉన్నప్పటికీ కోడి ఒత్తిడికి లోనైనప్పుడు విడుదలయ్యే హార్మోన్లు ఈ భాగంలో నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి గుండె భాగాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

6 / 6
చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఏ భాగాన్ని తింటున్నాం అనేది ముఖ్యం. ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం కేవలం కండరాల భాగం మాత్రమే తినడం సురక్షితం. చికెన్ వండే ముందు బాగా శుభ్రం చేయడం, అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం మర్చిపోవద్దు.