
ఇక కొన్ని సార్లు జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహణం రాశులపై సానకూల ప్రభావం చూపిస్తే మరికొన్ని సార్లు ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అయితే సెప్టెంబర్ 21 20025లో ఏర్పడే రెండో సూర్య గ్రహణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం, కన్యారాశిలో ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుందంట. వారికి అనేక సమస్యలు ఎదురు కానున్నాయంట.

కన్యా రాశి : కన్యా రాశి వారిపై సూర్య గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. దీని వలన వీరు ఇంటిలో కలహాలు, ఏ పనలు సరిగ్గా జరగకపోవడం, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి కరువు అవ్వడం వంటి సమస్యలు ఎదుర్కొంటారంట.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వీరికి అనారోగ్య సమస్యలు దరి చేరడం, కుటుంబంలో వివాదాలు జరగడం వటివి జరుగుతాయంట. అందువలన వీలైనంత వరకు వీరు వివాదాలకు దూరం ఉండటం, ముఖ్యంగా వీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంట.

Solar eclipse4

మిథున రాశి : మిథున రాశి వారికి సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్యగ్రహణం వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయంట. ఈ గ్రహణం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందంట. అలాగే ఏ పనిచేసినా ఆత్మవిశ్వాసం లేకపోవడం, పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని లేకపోతే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు.